డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజెంట్ అన్న అధికారిక వ్యవహారాల తో పాటు తను పూర్తి చేయవలసిన సినిమా షూటింగ్లో కూడా బిజీ అవుతున్నాడు .. తాజాగా కుంకి ఏనుగులు తెచ్చుకునేందుకు కర్ణాటకకు వెళ్లారు .. మరోవైపు క్యాబినెట్ మీటింగ్ లో కూడా కనిపించారు మధ్యలో కీరవాణిని సన్మానించే కార్యక్రమం కూడా పెట్టారు .. మరోవైపు ఓజీ సెట్స్‌ పైకి ఎప్పుడు వస్తున్నారు ? పవన్ ఇచ్చిన మాట ప్రకారం మళ్లీ తిరిగే సెక్స్ పైకి తీసుకువచ్చారు .. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఓ భారీ సెట్లో చిన్న షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు .. మరికొద్ది రోజుల్లోనే కొత్త షెడ్యూల్ కోసం ముంబై కూడా వెళ్ళనున్నారు .. ఇక మరి పవన్ ముంబై షెడ్యూల్లో జాయిన్ అవుతారా .. లేక ఆ షెడ్యూల్ పూర్తయిన తర్వాత తిరిగి హైదరాబాదులో కొత్త షెడ్యూల్ మొదలు పెడతార ? దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ..

ప్రస్తుతానికి అయితే పవన్ ఇంకా ఓజీ షూటింగ్ మొదలుపెట్టలేదు .. ఆయన మైండ్ మారక ముందే పొలిటికల్ గా అయిన మరింత బిజీ అవ్వకముందే షూటింగ్‌ను త్వరగా కంప్లీట్ చేయాలని యూనిట్ గట్టిగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తుంది .. అలాగే ఈ సినిమా కోసం పవన్ రెండు వారాల పాటు వర్క్ చేయాల్సి ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది .  ఒకవేళ అంతా టైం కుదరకపోతే కనీసం 10 రోజులైనా సినిమాని పూర్తి  చేయడానికి యూనిట్ రెడీగా ఉంది .. పవన్ ఈ సినిమా షూటింగ్లో అడుగుపెట్టడమే ఆలస్యం అనే విధంగా అంతా కాసుకుని కూర్చున్నారు .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9705876414 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: