
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఖలేజా 2010 సెప్టెంబర్ 7న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అయ్యింది. అప్పటకి మహేష్ బాబు నుంచి సినిమా వచ్చి మూడున్నరేళ్లు అవుతోంది. ఎప్పుడో 2007 సెప్టెంబర్ లో అతిథి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో మహేష్ - అనుష్క జంటగా నటించగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. శింగనమల రమేస్ బాబు , సీ కళ్యాణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 30న రీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా థియేటర్లలో డిజాస్టర్ అయినా ఇప్పటకీ బుల్లితెర మీద టీవీల్లో వస్తుంటే ప్రేక్షకులు ఎలా మైమరచిపోయి చూస్తారో తెలిసిందే.
ఇది ఎందుకు గొప్ప సినిమా అయ్యిందంటే ఈ సినిమా చూస్తున్నంత సేపు ఓ సినిమాలా కాకుండా ఒక మైథిలాజికల్ బుక్ చదువుతునట్లు అనిపిస్తుందని చాలా మంది అంటారు. సినిమా చూస్తున్నంత సేపు. అర్ధం చేసుకున్న వాళ్ళకి అర్ధం చేసుకున్నంత, పాటించిన వాళ్ళకి పాటించినంత కంటెంట్ ఉంది ఖలేజా లో అంటారు. అప్పట్లో ఈ సినిమా సరిగా ఆడలేదు, యావరేజ్ అంటారు కానీ, మహేష్, త్రివిక్రమ్ ఇద్దరి కెరీర్ లో ఇద్దరికి ది బెస్ట్ ఖలేజా నే. సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసిన ప్రతివాడు దేవుడే, అలాగే ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు అనే క్యారక్టర్ కూడా దేవుడే. అదే కథ, అంతే, అదే కథని ఎంటర్టైన్మెంట్ చేస్తూ చెప్పారు త్రివిక్రమ్. సీరియస్ గా చెప్తే ఏంటి ఈ ఏడుపుగొట్ట సినిమాలు అంటారు, సరదాగా చెప్తే ఏంటి మహేష్ దేవుడా, అంటే చూసే మేము పిచ్చోళ్లమా అంటారు. ఒక్కోసారి అడియన్స్ అంతే అనుకోవాలి.
చాలా మందికి చాలా చాలా అంటే చాలా ఇష్టమైన సినిమా ఇది. ఈ సినిమా నుండే మహేష్ బాబు - త్రివిక్రమ్ అభిమానులు మరింతగా పెరిగారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి రీ రిలీజ్ అవుతోన్న ఈ ఖలేజా ఈ సారి ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో ? చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు