అప్పుడప్పుడు సినీ సెలబ్రేటీల జీవితాల పైన కొంతమంది జ్యోతిష్యులు పలు రకాల ప్రకటనలు చేసి వివాదాస్పదంగా మారుతూ ఉంటారు. అలా ఇప్పటికే వేణు స్వామి చాలామంది సెలబ్రిటీల మీద చేసిన జోష్యం కొన్ని సందర్భాలలో కరెక్ట్ అవ్వగా మరికొన్ని సందర్భాలలో ఫెయిల్యూర్ అయ్యింది. అయితే ఇదంతా ఇలా ఉండగా ఈ ఏడాది జాన్వీ కపూర్ వివాహం చేసుకోబోతుందనే విషయాన్ని ఒక జ్యోతిష్యుడు చెప్పడం చర్చనీయాంశంగా మారుతోంది. ఒకవేళ ఇప్పుడు చేసుకోకుంటే ఆమె 33 ఏళ్ల వయసులో వివాహం చేసుకుంటుందని మరొక ఆప్షన్ ని కూడా తెలిపారు.


జాన్వీ వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుందని కొన్నిసార్లు గ్రహాలు మారే క్రమంలో సంసారంలో కొంతవరకు  ఇబ్బందులు కూడా తలెత్తుతాయని తెలిపారు. ప్రముఖ యూట్యూబ్లో సిద్ధార్థ కన్నన్ చేసిన ఒక ఇంటర్వ్యూలో జ్యోతిష్యుడు అంచనా ఇది అన్నట్లుగా తెలియజేశారు. జాన్వీ కపూర్ స్టార్ డం కూడా అసాధారణంగా ముందుకు వెళుతుందని తన సహచరుల కంటే ఇమే ముందు వరుసలో ఉంటుందని కూడా పాజిటివ్గా తెలియజేశారు. 2026 మధ్యకాలంలో ఈమె స్టార్ స్టేటస్ చాలా గొప్పగా ఉంటుందని తెలిపారు జ్యోతిష్యుడు.


అయితే ఈ విషయం పైన అభిమానులు ఇలాంటి జ్యోతిష్యాలు నమ్మదగిన వేన అసలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఒకసారి ఈ ఏడాది పెళ్లి అంటారు మరొకసారి 33 ఏళ్ల వయసులో అవుతుందని చెబుతున్నారు అసలు ఎలా నమ్మేది అంటూ తెలుపుతున్నారు. జాన్వీ కపూర్ ప్రస్తుతం శేఖర్ పహారియా అనే ఒక రాజకీయ నేపథ్యం కలిగి ఉన్న కుర్రాడితో ప్రేమలో ఉన్నట్లు గత కొన్నేళ్లలో వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఒకవేళ ఈ జ్యోతిష్యుడు చెప్పిన వార్తలు నిజమో కాదో తెలియాలి అంటే ఈ ఏడాది వరకు వేచి చూడాలి. ఇక ప్రస్తుతం జాన్వీ కపూర్ తెలుగులో రామ్ చరణ్ తో పెద్ది సినిమాతో పాటు హీరో నానితో కూడా మరొక సినిమాలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: