
2024 డిసెంబర్‌లో విడుదలైన పుష్ప 2 సినిమాకుగానూ రష్మిక రూ. 10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఛార్జ్ చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వరుస విజయాలు నేపథ్యంలో రష్మిక రెమ్యునరేషన్ మరింత పెరుగుతుందని అందరూ భావించారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ పుష్ప 2 తర్వాత వచ్చిన మూడు చిత్రాలకు ఆమె రెమ్యునరేషన్ గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో `చావా` మూవీతో రష్మిక బాలీవుడ్ లో బిగ్ హిట్ అందుకుంది. ఈ చిత్రానికిగాను ఆమెకు రూ. 4 కోట్లు చెల్లించారు.
ఆ తర్వాత `సికిందర్`లో యాక్ట్ చేసినందుకు రూ. 5 కోట్లు రష్మిక పారితోషికంగా అందుకుంది. ఇక తాజాగా `కుబేర` మూవీతో రష్మిక ప్రేక్షకులను పలకరించింది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ధనుష్, నాగార్జున మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు. అయితే ఈ సినిమాకు రష్మిక తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం రూ. 4 కోట్లు. పుష్ప 2 తో పోలిస్తే రష్మిక ప్రస్తుత రెమ్యునరేషన్ లో దాదాపు 60 శాతం కోత పడిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. మరి ఇందుకు గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు