కలెక్షన్ కింగ్ గా పేరున్న మోహన్ బాబుని ఆ కమెడియన్ నిజంగానే అవమానించారా.. అంత పెద్ద హీరో క్యారెక్టర్ నచ్చదు అంటూ ఆయన ఎందుకలా మాట్లాడారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మోహన్ బాబు అంటే నాకు అస్సలు నచ్చదు అంటూ మాట్లాడిన ఆ కమెడియన్ ఎవరో కాదు కామెడీ కింగ్ బ్రహ్మానందం.. అవును మీరు వినేది నిజమే. తాజాగా కన్నప్ప మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్రహ్మానందం మోహన్ బాబు అంటే నాకు అస్సలు నచ్చదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మోహన్ బాబుతో ఎంతో మంచి అనుబంధం ఉన్న బ్రహ్మానందం ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి ఈ మాటలు ఎందుకు మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం..

 తాజాగా మంచు విష్ణు హీరోగా.. ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్,కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన కనప్ప మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  హోస్ట్ గా వ్యవహరించిన యాంకర్ సుమ,కమెడియన్ బ్రహ్మానందం దగ్గరికి వెళ్లి మీకు మోహన్ బాబు లో నచ్చని నచ్చిన ఏదైనా పాయింట్ చెప్పండి అంటే అసలు నాకు మోహన్ బాబు లో ఏవి నచ్చవు..ఆయన అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ నిర్మొహమాటంగా చెప్పేశాడు. అయితే బ్రహ్మానందం మాటలు కు షాక్ అయిపోయిన సుమ నేను ఆశ్చర్యపోతున్నాను అని అనగా..

నాకు మోహన్ బాబు నచ్చకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి అని బ్రాహ్మానందం  చెబుతాడు. అయితే బ్రహ్మానందం అలా సరదాగా చెబుతున్నాడని, ఇందులో ఎలాంటి నిజం లేదు అని యాంకర్ సుమ అనగానే నిజమే మరీ ఒక మహానటుడు ఎవరికైనా నచ్చకుండా ఉంటారా అంటూ మోహన్ బాబుని పొగిడారు. అలా సరదాగా మోహన్ బాబు నచ్చడు అంటూ ఆ ఈవెంట్లో బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. అలాగే అసెంబ్లీ రౌడీ సినిమాలో ముందు నన్నే అడిగారని కానీ ఆ కంటెంట్,సబ్జెక్టు తనకు సెట్ అవ్వదని వదిలేసానని మోహన్ బాబు అడిగితే నేనే దాన్ని చేయమని ఇచ్చేసాను అంటూ కూడా బ్రహ్మానందం ఆ ఈవెంట్లో నవ్వులు పూయించారు

మరింత సమాచారం తెలుసుకోండి: