మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి ఆరోగ్య పరిస్థితి తీవ్ర అస్వస్థతకు గురైనట్టు వార్త‌లు వ‌స్తున్న‌యి . హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి లో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు . కుటుంబ సభ్యులు ఆసుపత్రి కి చేరుకొని వైద్యుల తో మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే ఆమె ఆరోగ్యం పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు . అయితే, మెగా అభిమానులు తీవ్ర‌ ఆందోళన చెందుతున్నారు .


మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి ఆరోగ్యం క్షీణించడం తో ఆమె ను కుటుంబ సభ్యులు వెంట నే ఆసుపత్రి కి తరలించినట్టు తెలుస్తోంది . మంగ‌ళ‌వారం అన‌గా ఈ రోజు తెల్లవారుజామున ఆమె అస్వస్థత కు గురికావడం తో కుటుంబ సభ్యులు తక్షణమే ఆమె ను హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి కి తీసుకెళ్లారు. వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణ లో ఆమెకు చికిత్స అందిస్తున్నార ని సమాచారం. అంజనా దేవి ఆరోగ్యం పై ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు .


ఇదే క్ర‌మంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లి అంజనాదేవీ తీవ్ర అస్వస్థకు గురయ్యారని వార్త‌లు రావడంతో  ఈ విషయం కేబినెట్ ప్రారంభం కాగానే పవన్ కు తెలియడం తో ఆయన వెంటనే  అక్కడ నుంచి బయల్దేరినట్లు తెలుస్తోంది. అంజనా దేవి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం గురించి అధికారిక సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది. దీంతో మెగా అభిమానులు , పవన్ ఫ్యాన్స్ కోంత‌ కంగారు పడుతున్నారు .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: