తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 పై ఊహాగానాలు, గాసిప్స్, అంచనాలు జోరందుకున్నాయి. తెలుగు బుల్లితెరలో అగ్రస్థానంలో నిలిచిన ఈ రియాలిటీ షో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే మేకర్స్ సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ఈ సీజన్ ప్రారంభం అవుతుందని ప్రకటించడంతో ఫ్యాన్స్ లో భారీ ఎగ్జైట్మెంట్ నెలకొంది. ప్రతి ఏడాది కొత్త కాన్సెప్ట్, కొత్త కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ షో ప్రేక్షకులను అలరిస్తుంటుంది. ఈసారి కూడా అదే స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ పండుగ కానుందనే అంచనాలు ఉన్నాయి.


ఒకవైపు కామనర్స్‌ కోసం 'అగ్నిపరీక్ష' ప్రక్రియ జరుగుతుండగా.. మరోవైపు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరు? అనే ప్రశ్నపై సోషల్ మీడియాలో గట్టి చర్చ మొదలైంది. నిక్కీ సంజనా గల్రాని, 'నరసింహ నాయుడు'లో లక్స్ పాప సాంగ్‌తో ఫేమస్ అయిన ఆశా షైనీ పేర్లు వినిపించడం షోపై అంచనాలు మరింత పెంచేసింది. అదేవిధంగా టీవీ యాక్ట్రెస్ నవ్యస్వామి, 'గుప్పెడంత మనసు' ఫేమ్ ముఖేష్ గౌడ, కోయిలమ్మ సీరియల్‌ ఫేమ్ తేజస్విని గౌడ, 'బ్రహ్మముడి' సీరియల్ ఫేమ్ కావ్య, జబర్దస్త్ కమెడియన్ ఇమ్యానుయేల్, అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మాయి వంటి పేర్లు కూడా ఈ సీజన్‌కి లింక్ అవుతున్నాయి.



అంతే కాకుండా, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఆరోపణలు చేసిన శ్రిష్టి వర్మ కూడా కంటెస్టెంట్స్ లిస్ట్‌లో ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది. యూట్యూబ్‌లో 'రాను బొంబాయికి రాను' పాటతో గుర్తింపు తెచ్చుకున్న రాము రాథోడ్ పేరు కూడా వినిపించడం ఆసక్తి కలిగిస్తోంది. ఈసారి బిగ్ బాస్ షోలో బుల్లితెర స్టార్‌లు, సినిమా ఫేసెస్, సోషల్ మీడియా ఫేమస్ ఫేసెస్, ఇంకా వివాదాస్పద వ్యక్తులు మిక్స్‌గా ఉంటారని అంచనా. ఇది కచ్చితంగా మాస్ ఆడియెన్స్‌కి కూడా కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఊహాగానాలే. అధికారికంగా స్టార్ మా, మేకర్స్ ఏ పేరునీ కన్‌ఫర్మ్ చేయలేదు. కానీ ఇప్పటికే బయటకి వస్తున్న ఈ జాబితా చూస్తే, బిగ్ బాస్ 9 మరింత హీట్ పక్కా అని చెప్పొచ్చు. ఈ షోలో ఎవరెవరు ఎంట్రీ ఇస్తారో తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 7 వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు ఈ ఊహాగానాలే ఫ్యాన్స్‌కి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: