
ఇండస్ట్రీలో చాలామంది కొత్త హీరోయిన్లు వస్తున్నప్పటికీ, రష్మిక–శ్రీలీలా రేంజ్‌ను బీట్ చేసే స్థాయి అందుకోలేకపోతున్నారు. అయితే, కచ్చితంగా వాళ్ళిద్దరిని కూడా ఛాలెంజ్ చేయగల సత్తా ఉన్న బ్యూటీ రుక్మిణి వసంత్ అంటున్నారు అభిమానులు. 2019 నుంచి ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ బ్యూటీ త్వరలోనే ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా ద్వార తన టాలెంట్ మరోసారి ప్రూవ్ చేసుకోబోతుంది అని అనుకునే లోపే..మరో స్వీట్ షాక్ ఇచ్చింది. రుక్మిణి వసంత్ కాంతారా: చాప్టర్ వన్ లో కూడా ఛాన్స్ దక్కించుకుంది, ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కాబోతోంది.
ఇలాంటి నేపథ్యంలోనే, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా చిత్రబృందం ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్‌లో హీరో రిషబ్ శెట్టి తరువాత అంతగా హైలెట్ అయిన వ్యక్తి రుక్మిణి వసంతే. ఆమె కట్టు ఆమె బొట్తు..ఆమె నటన..ఆమె అందం.. ముఖ్యంగా ఆమె గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి సినీప్రియులు మురిసిపోతున్నారు. త్వరలోనే రుక్మిణి వసంత్..నేషనల్ క్రష్ రష్మిక–శ్రీలీలా పేర్లను కూడా వెనక్కి నెట్టే స్థాయికి ఎదగబోతోంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం రుక్మిణి వసంత్‌కు సంబంధించిన ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ పై కుర్రాల్లు ఘాటు నాటీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా రుక్మిణి వసంత్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్ధాయికి వెళ్తుంది అని చెప్పుకోవడంలో సందేహమే లేదు..!