అప్గాన్‌ను హ‌స్త‌గతం చేసుకున్న తాలిబ‌న్‌లు త‌మ ష‌రియా చ‌ట్టాల అమలులో బిజీ గా ఉన్నారు. ముఖ్యంగా మ‌హిళ‌ల విష‌యంలో వారి నిబంధ‌న‌ల గురించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. నూత‌న విద్యావిధానాన్ని ప్ర‌వేశ పెట్టిన తాలిబ‌న్‌లు మ‌హిళ‌లు ఉన్న‌త విద్య‌ను చదువుకోవ‌డానికి ప‌ర్మీష‌న్ ఇచ్చారు. కానీ, కొన్ని నిబంధ‌న‌ల‌తో.. పురుషుల‌తో క‌లిసి చ‌దువుకోకూడ‌దు, ప్ర‌త్యేక డ్రెస్ కోడ్ ధ‌రించాలి ఇలాంటి రూల్స్ పెట్టారు. దీనికి నిర‌స‌న‌గా అప్గ‌న్ మ‌హిళ‌లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఉద్య‌మాన్ని ప్రారంభించారు. `డు నాట్ ట‌చ్ మై క్లాత్స్‌`, `అఫ్గ‌నిస్తాన్ క‌ల్చ‌ర్‌` హ్యాష్ ట్యాగ్‌ల‌తో అంద‌మైన రంగురంగుల అఫ్గ‌న్ సంప్ర‌దాయ దుస్తులు ధ‌రించి త‌మ ఫోటోల‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నారు.


   సోషల్ మీడియాలో మాధ్యమాల్లో ఈ ఉద్యమానికి అంకురం చేసిన డా.బహర్ జలాలీని బీబీసీ ప్రతినిధి సోడాబా హైదరి ఇంట‌ర్వూ చేశారు. 'అఫ్గానిస్తాన్ ట్రెడిషనల్ క్లోత్స్' అని గూగుల్లో సెర్చే చేయగానే విభిన్న  రంగుల‌తో కూడిన అందమైన దుస్తులను చూసి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తారు. భారీ డిజైన్లు ఎంబ్రాయిడరీ జాగ్రత్తగా అమర్చిన చిన్నచిన్న అద్దాలతో ప్రతి వ‌స్త్రం ప్రత్యేకంగా క‌నిపిస్తుంది. అఫ్గానిస్తాన్ జాతీయ నృత్యం 'అట్టాన్' చేసేటప్పుడు కుచ్చులతో కూడిన పొడవైన స్కర్ట్లు వేసుకున్న  మ‌హిళ‌ను చూస్తే అఫ్గ‌న్ సంస్కృతి ఇదా అని అనిపిస్తుంది.


  అఫ్ఘ‌నిస్తాన్ లోకి ఒక్కో ప్రాంతంలో ఓక్కో విధ‌మైన అలంక‌ర‌ణ ఆచారాలు ఉన్నాయి. తాలిబ‌న్‌ల పాల‌న‌కు ముందు అఫ్గ‌న్ మ‌హిళ‌లు యూనివ‌ర్సిటీల‌కు ఆఫీస్‌ల‌కు వెళ్లే స‌మ‌యంలో సంప్ర‌దాయ దుస్తుల‌తో పాటు  కాస్త పొట్టిగా ఉండే వ‌స్త్రాల‌ను ధ‌రించేవారు.. అలాగే కొన్నిసార్లు జీన్స్ కూడా వేసుకునేవారు. స్కార్ఫుల‌ను త‌ల‌కు స్టైల్‌గా ధ‌రించేవారు.



తాలిబ‌న్‌ల నిబంధ‌న‌ల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తాలిబ‌న్ మ‌హిళ‌లు సోష‌ల్ మీడియా వేధిక‌గా త‌మ దేశ మ‌హిళ‌ల‌కు స‌పోర్ట్ చేస్తూ `డు నాట్ ట‌చ్ మై క్లాత్స్‌`, `అఫ్గ‌న్ క‌ల్చ‌ర్‌` అనే హ్య‌ష్ ట్యాగ్‌ల‌తో పోస్టులు పెడుతున్నారు. అఫ్గానిస్తాన్లోని అమెరికన్ విశ్వవిద్యాలయంలోని మాజీ హిస్టరీ ప్రొఫెసర్ డాక్టర్ బహర్ జలాలీ ప్రారంభించిన సామాజిక ఉద్యమంలో భాగమైన మహిళలంతా గతంలోలాగే తాము సంప్రదాయ దుస్తులు వేసుకునేందుకు అనుమ‌తి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: