
ఇటు టిడిపి నేతలు కూడా అదే బాటలో జగన్‌ని తిడుతున్నారు. ఇక ఓడిపోయి తీవ్ర నిరాశలో ఉన్న టిడిపి నేతలు, కార్యకర్తలపై అనవసరంగా కేసులు పెట్టి, జైలుకు పంపించడం వల్ల, వారికే పరోక్షంగా బెనిఫిట్ అవుతూ వచ్చింది. అనవసరంగా టిడిపి నేతలపై ప్రజల్లో సింపతీ పెరిగేలా చేశారు. అటు లోకేష్‌ని సైతం అరెస్ట్ చేయించి, ఆయన్ని పెద్ద నాయకుడుగా హైలైట్ చేశారు. లోకేష్ అరెస్ట్ సమయంలో టిడిపి నేతలు, టిడిపి శ్రేణులు ఓ రేంజ్‌లో యాక్టివ్ అయ్యాయి.
మామూలుగా ఓటమి తర్వాత చాలామంది టిడిపి నేతలు సైలెంట్ ఉన్నారు. కానీ ఇలా అరెస్ట్‌లు చేసి వారిని మరింతగా యాక్టివ్ చేశారు. పార్టీలో ఏదైనా సమస్య వస్తే అంత ఏకమయ్యేలా వైసీపీ నేతలు చేశారు. ఇక తాజాగా జోగి రమేష్ ఎపిసోడ్‌తో టిడిపిని మరింత పైకి లేపినట్లు కనిపిస్తోంది. టిడిపి నేత అయ్యన్నపాత్రుడు...జగన్‌ని తిడితే, జోగి వచ్చి చంద్రబాబు ఇంటి దగ్గర రచ్చ చేశారు.
వైసీపీ నేతలు ఎలాగో బూతులు మాట్లాడతారు...జోగి కూడా ఏమి తక్కువ కాదు...అలాంటప్పుడు అయ్యన్నకు కౌంటర్లు ఇస్తే సరిపోయేది...లేదా పోలీసు కేసు పెట్టిన బాగానే ఉండేది...అది కాకపోతే టిడిపి ఆఫీసుల దగ్గర నిరసనలు తెలియచేసిన కరెక్ట్‌గానే ఉండేది...కానీ జోగి ఏకంగా మందిని తీసుకెళ్లి బాబు ఇంటి దగ్గర రచ్చ చేయడం వల్ల, అనవసరంగా చంద్రబాబుపై సింపతీ పెంచడమే కాదు...టిడిపి శ్రేణులని ఇంకా ఏకం చేసేలా చేశారు.