వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు....రాజకీయం నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేయనున్నారు? అంటే ఇప్పుడుప్పుడే రాజుగారి రాజకీయంపై క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది. ఏది ఎలా జరిగిన వైసీపీ తరుపున ఎంపీగా గెలిచిన 6 నెలల లోపే రఘురామ రివర్స్ రాజకీయం మొదలుపెట్టారు. వైసీపీపైనే విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. ఢిల్లీలో కూర్చుని ప్రతిరోజూ జగన్ ప్రభుత్వంపై విమర్శనస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు.

ఇక రఘురామ...వైసీపీల మధ్య ఎలాంటి రచ్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే. అయితే పరోక్షంగా రఘురామ...చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారనేది వైసీపీ ఎప్పటినుంచో చేస్తున్న ఆరోపణ...అందుకు తగ్గట్టుగా పలు ఆధారాలు బయటపెట్టారు కూడా. అంటే రఘురామ...బాబు మనిషి అని అర్ధమైపోతుంది. ఇలా బాబుకు అనుకూలంగా ఉన్న రఘురామ...నెక్స్ట్ ఎన్నికల్లో టి‌డి‌పి నుంచే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇక్కడొక ట్విస్ట్ కూడా ఉంది.

ఒకవేళ టి‌డి‌పి-జనసేనలు పొత్తు పెట్టుకుంటే అందుకు తగ్గట్టుగా రాజుగారి రాజకీయం ఉండేలా ఉంది. ఖచ్చితంగా ఆ రెండు పార్టీల పొత్తు ఖాయమని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ స్థానం జనసేనకు దక్కే ఛాన్స్ కూడా ఉంది. 2014లో పొత్తులో భాగంగా ఈ సీటుని టి‌డి‌పి...బి‌జే‌పికి వదిలేసింది.

అంటే నెక్స్ట్ జనసేనకు ఇచ్చే ఛాన్స్ ఉంది. పైగా గత ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు బాగానే ఓట్లు పడ్డాయి. జనసేనకు ఇస్తే రాజుగారు....అదే పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. పైగా టి‌డి‌పి సపోర్ట్ ఉంటే ఇంకా తిరుగుండదని రాజుగారు అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లోనే రాజుగారు...టి‌డి‌పి‌పై కేవలం 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు టి‌డి‌పి-జనసేనలు కలిస్తే రాజుగారికి ఢోకా ఉండదని అనుకుంటున్నారు. అలాగే గత ఎన్నికల్లో నరసాపురం నుంచి టి‌డి‌పి తరుపున పోటీ చేసిన శివరామరాజు...మళ్ళీ ఉండి అసెంబ్లీలో పోటీ చేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి చూసుకుంటే రాజుగారికి షెల్టర్ ఫిక్స్ అయిపోయినట్లే కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr