దేశంలో కరోనా కేసుల విషయంలో ప్రజల్లో భయాలు అలానే ఉన్నాయి. కరోనా కేసులు తగ్గుతున్నా సరే మనలో భయం మాత్రం తగ్గడం లేదనే మాట అక్షరాలా నిజం. ఇక దీనిపై రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఘాటు విమర్శలు కూడా చేస్తున్నాయి. కరోనా మూడో వేవ్ ఇప్పుడు ఇంకా కంగారు పెడుతున్న విషయం. ప్రతీ రోజు కేసులు అయితే రెండు నెలల నుంచి తగ్గుతున్నాయి. రెండో వేవ్ దాదాపుగా అదుపులోకి వచ్చింది. మాస్క్ ల విషయంలో వ్యాక్సిన్ విషయంలో కేంద్రం కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తుంది.

గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా  13,596 కొత్త కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. గడిచిన 230 రోజుల్లో అతి తక్కువ కేసులు నమోదు అయ్యాయని పేర్కొంది. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 97.79 కోట్ల వ్యాక్సిన్ మోతాదులు ఇవ్వబడ్డాయి అని కేంద్రం వివరణ ఇచ్చింది. దేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 98.12%వద్ద ఉంది; మార్చి 2020 తర్వాత ఇదే అత్యధికం అని తెలిపింది. గత 24 గంటల్లో 19,582 మంది కరోనా నుండి కోలుకోగా మొత్తం రికవరీల సంఖ్య 3,34,39,331 కి పెరిగింది అని పేర్కొంది.

యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1% కంటే తక్కువ, ప్రస్తుతం 0.56% గా ఉందని మార్చి 2020 తర్వాత అత్యల్ప యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి అని భారతదేశ యాక్టివ్  కేసుల సంఖ్య 1,89,694 వద్ద ఉంది అని వివరించింది. 221 రోజుల్లో అతి తక్కువ యాక్టివ్ కేసులు నమోదు అయినట్టు పేర్కొంది. వీక్లీ పాజిటివిటీ రేటు (1.37%) గత 115 రోజులకు 3% కంటే తక్కువగా ఉందని తెలిపింది. గత 49 రోజులకు 3% కంటే తక్కువ రోజువారీ పాజిటివిటీ రేటు (1.37%) గా ఉండగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 59.19 కోట్ల మొత్తం పరీక్షలు నిర్వహించబడ్డాయి అని వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: