ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగియగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బీసీ జనగణన జరపాలని అసెంబ్లీలో తీర్మానించే అంశగానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని త్వరలో రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో ప్రవేశ పెట్టె అవకాశం కనపడుతుంది. ఆదాని ఎంటర్ ప్రైజెస్ కు 130 ఎకరాల ను విశాఖ మధురవాడ లో కేటాయింపు నకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 200 మెగా డేటా సెంటర్, బిజినెస్ పార్కు కోసం 130 ఎకరాల కేటాయించినట్టు తెలుస్తుంది.

ప్రకాశం జిల్లా వాడ రేవు  సహా 5 ఫిషింగ్ హార్బర్ల్ డీపీఆర్ లకు ఆమోదం తెలిపిన కేబినెట్... 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా కోసం త్రై పాక్షిక ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా వార్తలు వస్తున్నాయి. 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కు వీలుగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంగీకారం తెలిపింది అని సమాచారం. విశాఖ మధురవాడ లో శారదా పీఠానికి 15 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు వార్తలు వస్తున్నాయి. అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు ఉండాలన్న అంశంపై విస్తృత ప్రచారం చేసే అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ డబ్ల్యూఎస్ కు ప్రత్యేక శాఖ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సమావేశం తర్వాత సిఎం జగన్ సాయంత్రం కేబినేట్ నిర్ణయాలను సాయంత్రం గవర్నర్ కు వివరించే అవకాశం ఉంది అని అంటున్నారు. సిఎం జగన్ త్వరలోనే ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉందని దీనికి సంబంధించిన అంశాలను కూడా ఆయన గవర్నర్ కు వివరించే అవకాశం ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి. త్వరలోనే మంత్రులతో ఆయన అంతర్గత సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది అని కూడా తెలుస్తుంది. మరి ఏం జరుగుతుంది ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: