తెలుగుదేశం పార్టీకి రాయలసీమ ఎలాగో సరిగ్గా కలిసి రాదు...సీమలోని జిల్లాలు వైసీపీకి అనుకూలంగా ఉంటాయి..అలాగే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా అదే పరిస్తితి. కాస్త చెప్పాలంటే గుంటూరు నుంచి ఇటు పైకి శ్రీకాకుళం వరకు టీడీపీకి అనుకూలం. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ఈ జిల్లాలే ప్రదాన కారణం. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీకి పెద్ద కంచుకోటగా ఉంది.

అయితే అలాంటి జిల్లాలో టీడీపీని పూర్తిగా బలోపేతం చేయడంలో చంద్రబాబు విఫలమైనట్లే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఎలాగో కాస్త ఎదురుదెబ్బ తగిలింది. అలా అని జిల్లాలో టీడీపీ పరిస్తితి మరీ దరిద్రంగా ఏమి లేదు. ఇక్కడ టీడీపీకి బలమైన నాయకులు ఉన్నారు. పార్టీ క్యాడర్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మరి అలాంటప్పుడు జిల్లాపై పెద్దగా ఫోకస్ చేయకుండా బాబు లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

పైగా ఇక్కడ పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది...ఇలాంటి సమయంలో పార్టీని మరింత బలోపేతం చేస్తే బాగా ప్లస్ అవుతుంది...కానీ బాబు ఆ కార్యక్రమం చేయడం లేదు. ఇప్పటికే చాలా లేటు అయింది...ఇంకా లేటు చేస్తే ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్తితి అస్సాం అయ్యేలా ఉంది. ముఖ్యంగా కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీని నడిపించే నాయకులు లేకపోవడం మరీ దారుణమని చెప్పాలి.

కొవ్వూరు ఎలాగో టీడీపీకి కంచుకోట...ఇక్కడ ఇప్పుడు టీడీపీని నడిపించే నాయకుడు లేరు. 2014లో జవహర్ పోటీ చేసి గెలిచి మంత్రి కూడా అయ్యారు...2019 లో ఆయనకు సీటు రాకుండా మరొక వర్గం ప్రయత్నించి సక్సెస్ అయింది...దీంతో కొవ్వూరులో వంగలపూడి అనితని నిలబెడితే ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ జవహర్ దిక్కు అయ్యారు. అలా అని కొవ్వూరు సీటు ఆయనకు ఫిక్స్ చేయడం లేదు. అటు చింతలపూడిలో కూడా నాయకుడు లేరు. పీతల సుజాత...మళ్ళీ పగ్గాలు దక్కించుకునేందుకు చూస్తున్నారు. కానీ బాబు ఏది తేల్చడం లేదు. ఇలాగే లేటు చేస్తే కొవ్వూరు, చింతలపూడిల్లో టీడీపీ ఖాళీ అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: