వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు అయిపోయింది...ఈ రెండున్నర ఏళ్ల సమయంలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు బాగుంటే, మరికొందరు ఎమ్మెల్యేలు మెరుగైన పనితీరు కనబర్చడంలో వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. వైసీపీ నుంచి గెలిచిన 151 మంది ఎమ్మెల్యేల్లో కనీసం 50 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని తెలుస్తోంది. అయితే వైసీపీలో ఉన్న కమ్మ ఎమ్మెల్యేల పనితీరుని ఒక్కసారి గమనిస్తే...వారిలో ఒక ఎమ్మెల్యే పనితీరు బెటర్ గా ఉందని, మిగిలిన వారిది అంతగా బాగోలేదని తెలుస్తోంది.

అసలు వైసీపీలో కమ్మ నేతలు తక్కువగానే ఉంటారని చెప్పొచ్చు. తక్కువ మంది ఉన్నా సరే వైసీపీ గాలిలో ఆరుగురు కమ్మ ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి విజయం సాధించారు. టీడీపీలో కమ్మ వర్గానికి చెందిన నేతలకు చెక్ పెట్టడానికే ఆయా నియోజకవర్గాల్లో జగన్ కూడా కమ్మ నేతలని నిలబెట్టి సక్సెస్ అయ్యారు. అలా ఆరు చోట్ల కమ్మ ఎమ్మెల్యేలు గెలిచారు.


వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు, తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్, పెదకూరపాడులో నంబూరు శంకర్ రావు, మైలవరంలో వసంత కృష్ణప్రసాద్, దెందులూరులో అబ్బయ్య చౌదరీలు విజయం సాధించారు. ఇక గుడివాడలో కొడాలి నాని గెలిచిన విషయం తెలిసిందే. ఆయన మంత్రిగా ఉన్నారు. కొడాలిని పక్కనబెడితే...మిగిలిన ఎమ్మెల్యేల్లో నలుగురు ఎమ్మెల్యేల పనితీరు ఏమి అంతగా బాగోలేదని తెలుస్తోంది. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి రాజకీయంగా బలంగానే ఉన్నారు గానీ, వ్యక్తిగతంగా మాత్రం బలపడలేదని తెలుస్తోంది. ఒక్క నంబూరు శంకర్ రావు మాత్రం ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నట్లు కనిపిస్తోంది.

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సరే ఆయన, పెదకూరపాడు ప్రజలకు బాగా దగ్గరయ్యారు. ఆయనకు ఈ రెండున్నర ఏళ్లలో ప్రజా మద్ధతు పెరిగినట్లు తెలుస్తోంది. కానీ మిగిలిన ఎమ్మెల్యేలు విషయంలో మాత్రం ప్రజలు అంత పాజిటివ్ గా లేరని తెలుస్తోంది. అటు టీడీపీ నుంచి వైసీపీ వైపుకు వచ్చిన ఇద్దరు కమ్మ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీలకు వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: