కుప్పం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత పార్టీ నాయకుల ఒత్తిడి పెరుగుతుంది అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. ఎన్నికల విషయంలో చంద్రబాబు నాయుడు గతంలో ఇక్కడ పెద్దగా దృష్టి సారించిన పరిస్థితి ఉండేది కాదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారు ఏంటనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఎన్నికల తర్వాత కొంతమంది కీలక నాయకులు చిత్తూరు జిల్లాలో పార్టీ మారే అవకాశం ఉందని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

పుంగునూరు నియోజకవర్గానికి సంబంధించి కొంత మంది కీలక నాయకులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సమక్షంలో అధికార పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా కుప్పం నియోజకవర్గానికి సంబంధించి మూడు మండలాల నాయకులు మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో అధికార పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం చంద్రబాబు నాయుడు ని బాగా ఇబ్బంది పెడుతోంది. కొంతమంది కీలక నాయకులు ఇటీవలి కాలంలో పార్టీ వ్యవహారాల మీద పట్టు కోల్పోయారని ప్రచారం కూడా ఉంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి చిత్తూరు జిల్లాలో ఎవరు బయటికి వెళ్ళినా సరే పార్టీ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా నాయకులకు సొంత నియోజకవర్గ నాయకులు ఏ విధంగా కాపాడుకుంటారు అనేది చర్చనీయాంశం అయిన అంశం. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకి కొంతమంది కీలక నాయకులు అండగా నిలవాలని ఉన్నా సరే ఎన్నికల్లో సరైన సహకారం అందించలేదు అని అందుకే అధికార పార్టీ ఎక్కువగా ప్రభావం చూపించిందని అంటున్నారు. మరి భవిష్యత్తు పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో ఏవిధంగా మారబోతున్నాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయిన అంశం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టిడిపి కీలక నాయకులు కుప్పం నియోజకవర్గం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: