తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిన్న ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ప్రెస్ మీట్ లో దాదాపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు గంటల పాటు మాట్లాడారు. ఈ రెండు గంటల పాటు కేవలం భారతీయ జనతా పార్టీ పైనే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఎక్కడా తగ్గకుండా భారతీయ జనతా పార్టీని చీల్చి చెండాడారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ముఖ్యంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ.. తెలుగు కోడలు అయిన నిర్మల సీతారామన్ ను కూడా టార్గెట్ చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. కేంద్ర బడ్జెట్ ను విమర్శిస్తూనే తెలంగాణ రాష్ట్ర బిజెపి లపై కూడా విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. ఈ తరుణంలోనే  జర్నలిస్టులు అడిగిన సమాధానాలకు తనదైన స్టైల్ లో సీఎం కేసీఆర్ సమాధానాలు ఇచ్చేసారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో జాతీయ రాజకీయాలపై బాగా మాట్లాడడంతో... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు...జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు అనే ప్రశ్న మొదలైంది. ఈ తరుణంలోనే ఓ జర్నలిస్టు ఇదే క్వశ్చన్ అడిగింది. మీరు భారత దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించింది ఓ మహిళా జర్నలిస్టు. 

అయితే దీనిపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... అవసరాన్ని బట్టి తాను ఏ నిర్ణయం అయినా తీసుకుంటానని... కావాలంటే వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు బరిలో ఉంటానని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఇదివరకే తాను పలుమార్లు పార్లమెంటు సభ్యుడిగా విజయం సాధించానని... తనకు ఎంపీగా గెలవడం అసలు కొత్త విషయమే కాదని తేల్చి చెప్పారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అద్భుత విజయం సాధించిన పోతుందని... 95 నుంచి 105 సీట్ల వరకు తాము గెలవబోతున్న మని జోస్యం చెప్పారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఇక గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని కొన్ని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలకు స్వయంగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు బ్రేకులు వేశారు. తాము మరో రెండేళ్లు పరిపాలన కొనసాగిస్తామని... అసలు ముందస్తు ఎన్నికలపై ఇలాంటి ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. కాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా అలాగే మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. అయితే దేశ రాజకీయాల వైపు వెళితే కరీంనగర్ నుంచి బరిలోకి దిగే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కరీంనగర్ ఎంపీ గా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు. ఒకవేళ సీఎం కేసీఆర్ కరీంనగర్ నుంచి పోటీ చేయాలనుకుంటే బండి సంజయ్.... పోటీ చేసే చాన్స్ వుంది. అయితే దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: