క్షేత్రస్ధాయిలో జరుగుతున్న యవ్వారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. సినిమా టికెట్ల ధరలు, ప్రీమియర్ ఫోలు, ప్రత్యేకషోలు వేసుకునే విషయంపై జగన్మోహన్ రెడ్డితో కొందరు సినీ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీకి చిరంజీవి నేతృత్వంలోనే సినీ ప్రముఖులు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, నారాయణమూర్తి, కొరటాల శివ, ఆలీ, పోసాని కృష్ణమురళి తదితరులు హాజరయ్యారు.





భేటీలో సమస్యలు దాదాపు సెటిలైపోయినట్లే అని చిరంజీవితో పాటు అందరు మీడియా ముందు చెప్పారు. జీవో కూడా ఈ నెలాఖరుకు జారీ అవుతుందని అనుకుంటున్నారు. సినిమా టికెట్ల ధరలు, ప్రీమియర్ షోలు, ప్రత్యేకషోల విషయంలో ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడింది మొదట పవన్ కల్యాణే అన్న విషయం తెలిసిందే. సినిమా ఫీల్డ్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాత్రమే కాకుండా డైరెక్టుగా జగన్నే ఎటాక్ చేశారు. తన సినిమాలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం మొత్తం పరిశ్రమనే ఇబ్బంది పెడుతోందంటు ఆరోపించారు. దాంతో వివాదం తారాస్ధాయికి చేరుకునేసింది.





అందుకనే ఇపుడు జగన్ కాస్త తెలివిగా మెగాస్టార్ ద్వారానే సమస్య పరిష్కారంపై చర్చలు పూర్తయ్యిందనిపించారు. చిరంజీవి నేతృత్వంలో భేటీ అయిన వాళ్ళు కూడా జగన్ తో పాటు చిరంజీవికి కూడా ధన్యవాదాలు చెప్పారు. అంటే రేపు మళ్ళీ ఇదే సమస్యను పవన్ గనుక ప్రస్తావిస్తే అందరు చిరంజీవి వైపే చూస్తారు. పైగా చిరంజీవి నేతృత్వంలో జగన్ తో భేటీ అయిన వాళ్ళల్లో  మహేష్, ప్రభాస్, కొరటాల శివ, రాజమౌళి, నారాయణమూర్తి, ఆలీ ఇలా అన్నీ సామాజికవర్గాల వాళ్ళూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం పలానా సామాజికవర్గాన్ని టార్గెట్ చేసిందని అనేందుకు కూడా లేదు.





ఒకవేళ పవన్ ఏమన్నా ఆరోపణలు చేసినా చిరంజీవితో పాటు భేటీలో పాల్గొన్న వాళ్ళే సమాధానాలు చెప్పాల్సుంటుంది. స్వయాన తన సోదరుడి నేతృత్వంలోనే సమస్య పరిష్కారమైనపుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి పవన్ కు ఏమీ ఉండదు. రాజకీయంగా మాట్లాడినా దానికి వైసీపీ నేతలు అంతేస్ధాయిలో సమాధానాలు చెబుతారు. కాబట్టి మామూలు జనాలు కూడా పవన్ను లైటుగానే తీసుకుంటారు. మొత్తానికి పవన్ కు జగన్ బాగానే చెక్ పెట్టారనే అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: