కరోనా మహమ్మారి తన పుట్టింటిని వదలడం లేదు. కరోనాలో కొత్తగా వచ్చిన స్టెల్త్‌ ఒమిక్రాన్‌ వేరియంట్.. మరోసారి చైనాను వణికిస్తోంది. ఇప్పుడు చైనాలో రెండేళ్ల తర్వాత అత్యధిక కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో చైనాలోని 13 నగరాల్లో కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ కొత్త కరోనా వైరస్‌ తొలిసారి చైనాలోనే బయటపడింది. దీని కారణంగా చైనాలో  రెండేళ్ల తర్వాత అత్యధికంగా 5,280 కొత్త కేసులు వచ్చాయి.


ఇవి క్రితం రోజుతో పోల్చుకుంటే దాదాపు రెట్టింపు అన్నమాట. అయితే.. ఈ స్టెల్త్ ఒమిక్రాన్‌ కారణంగా కొత్తకేసు ఒక్కటీ రాకూడదన్నచైనా వ్యూహం ఫలించడం లేదు. ఈ స్టెల్త్ ఒమిక్రాన్‌ దెబ్బతో రెండేళ్లుగా చైనా కాపాడుకుంటూ వస్తున్న రికార్డులన్నీ గల్లంతవుతున్నాయి. దీంతో ఇప్పుడు ఈ స్టెల్త్ ఒమిక్రాన్‌ కారణంగా దడ పుడుతోంది. క్రమంగా ఈ స్టెల్త్ ఒమిక్రాన్‌ కేసులు దారుణంగా పెరుగుతున్నాయి.


చైనాలో ఇప్పుడు ఆరో రోజు కూడా వెయ్యికి పైగా కేసులు వచ్చేశాయి. చైనాలో రెండేళ్ల క్రితం 2020 ఫిబ్రవరి 12న దాదాపు 15 వేల కేసులు ఒకే రోజు వచ్చాయి. ఆ తర్వాత 5,090 కేసులు వచ్చాయి. ఈ స్టెల్త్ ఒమిక్రాన్‌ విజృంభణతో  చైనా కట్టడి చర్యలు ముమ్మరం చేసింది. ఏకంగా 13 పెద్ద నగరాలను క్లోజ్ చేసేసింది. తన దేశంలోని 3 కోట్ల మందికి పైగా ప్రజలను చైనా లాక్‌డౌన్‌ లో ఉంచేసింది.


ఈ స్టెల్త్ ఒమిక్రాన్‌ విజృంభణ కారణంగా చాలా పరిశ్రమలు మూతపడిపోయాయి. అనేక చోట్ల ప్రజా రవాణా ఆపేశారు. చైనాలోని జిలిన్‌, చాంగ్‌చున్‌, షెన్‌ఝెన్‌, షాంఘై, లాంగ్‌ఫాంగ్‌ నగరాల్లో కఠిన ఆంక్షలు విధించి అమలు చేస్తున్నారు. అంతేకాదు.. మరోసారి విస్తృతస్థాయిలో ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక చైనా రాజధాని బీజింగ్‌లోనూ ముందు జాగ్రత్తగా అనేక చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు.. ఈ కరోనా ఆంక్షలను అప్పుడే తొలగించలేమని చైనా వైద్య నిపుణులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: