ఇండియా చైనాల మధ్య కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండు సంవత్సరాల కిందట గాల్వానా లోయలో జరిగిన ఘటనతో ఈ వివాదం మరింత తీవ్రమైంది. దీంతో చైనాకు వ్యతిరేకంగా ఇండియా అనేక చర్యలు తీసుకుంటోంది. చైనా వస్తువులను బ్యాన్ చేయాలని ఇంతకముందే పిలుపునిచ్చింది.టెక్నికల్ గా కూడా చైనాను దెబ్బకొట్టేలా ప్లాన్ వేసింది. అయితే ఓ వైపు చర్చలు అంటూనే మరోవైపు వాస్తవాధీన రేఖ వెంబడి నిర్మాణాలను చేస్తోంది. అయితే ఇటీవల చైనా విదేశాంగ మంత్రి ఇండియాలో ఆకస్మికంగా పర్యటించారు. ఇండియాతో సత్సంబంధాల విషయంలో చర్చలు రావాలని కోరారు. అయితే ఎల్వోసి వివాదం సద్దుమణిగిన తరువాతే మిగతా విషయాలపై చర్చలు అనేవి ఉంటాయని ఇండియా రిప్లై ఇచ్చింది.ఇక ఈ క్రమంలో అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్రటరీ అడ్వైజర్ దిలీప్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 'ఇండియా వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఉల్లంఘనకు పాల్పడినా రష్యా ఇండియాకు మద్దతు నిలవదు. చైనా రష్యాలు ఎప్పుడూ కూడా సహకరించుకుంటూనే ఉంటాయి. ఇక ఆ దేశాల మధ్య ఉన్న బంధం విడదీయరానిది. అలాంటప్పుడు చైనాను కాదని ఇండియాకు ఎందుకు సాయం చేస్తుంది.. ?' అని అన్నారు.



భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్ ప్రింగ్లాతో సహా భారతీయ సంభాషనకర్తలతో సమావేశం జరిగిన తరువాత దిలీప్ సింగ్ ఈ కామెంట్స్ చేశారు.రష్యాపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో ప్రముఖ పాత్ర పోషించిన యూఎస్ డిప్యూటీ ఎన్ఎస్ఏ.. ఉక్రెయిన్ పై దాడిని రష్యాను విమర్శించకపోవడంపై పాశ్చాత్య శక్తులలో పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ప్యూటీ నేషనల్ సెక్రటరీ అడ్వైజర్ దిలీప్ సింగ్ ఇండియాలో పర్యటించారు.ఈ క్రమంలో న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ డాలర్ ఆర్థిక వ్యవస్థను అణగదొక్కడానికి.. రూబుల్ కు సపోర్ట్ ఇవ్వడానికి మేము ఇష్టపడమని అన్నారు. ఈమధ్య ఇండియా ఇంధన దిగుమతిని రష్యా నుంచి చేసుకోవడానికి రెడీ కావడంపై అమెరికా ఆంక్షలను ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు. అయితే ఇండియా తన అవసరాల కోసం చమురును తక్కువ ధరకు కొనుగోలు చేయడంలో తప్పేముంది..? ఉక్రెయిన్ పై యుద్ధంని ఆపాలని రష్యాను కోరుతున్నాము కదా.. అని ఇండియా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: