’వచ్చే ఎన్నికల్లో పుంగనూరు, తంబళ్ళపల్లె నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి సోదరులకు డిపాజిట్లు రాకుండా చేయాలి’..ఇది చంద్రబాబునాయుడు తాజాగా ఇచ్చిన పిలుపు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలెంజ్ చేశారు కాబట్టి దానికి కౌంటర్ గా చంద్రబాబు కూడా ఒక చాలెంజ్ చేశారనే అనుకోవాలి. మరి ఇద్దరి సవాళ్ళలో ఎవరు సక్సెస్ అవుతారు ? ఎవరు ఫెయిలవుతారు ? అన్నది ఆసక్తిగా మారింది.





ఇప్పుడున్న పరిస్ధతుల్లో అయితే పెద్దిరెడ్డి సక్సెస్ కు దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కుప్పం నియోజకవర్గంలోని స్ధానిక సంస్ధలను, మున్సిపాలిటీని వైసీపీ స్వీప్ చేసేసింది. వైసీపీ దెబ్బకు అప్పట్లో  చంద్రబాబు నోటమాట రాలేదు. వచ్చే ఎన్నికల్లో తన గెలుపుపై చంద్రబాబుకే అనుమానం వచ్చినట్లుంది. అందుకనే వరసబెట్టి నియోజకవర్గంలోని నేతలతో భేటీ అవుతున్నారు. ఇప్పటికి నాలుగుసార్లు నియోజకవర్గంలో పర్యటించారు. అంతకుముందు ఏడాదిలో ఒకసారి కుప్పానికి వస్తే అదే చాలా గొప్ప. 40 ఏళ్ళ తర్వాత కుప్పంలో చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్నారు.





సరే ఇక పుంగనూరు విషయానికి వస్తే గెలుపోటములతో సంబంధంలేకుండా పెద్దిరెడ్డి రెగ్యులర్ గా నియోజకవర్గంలోనే తిరుగుతుంటారు. ముఖ్యనేతలతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు. అంటే నేతలు, కార్యకర్తలతో  మొదటినుండి  పెద్దిరెడ్డికి హ్యూమన్ టచ్ అనేది ఉంది. అందుకనే గెలుపోటములతో సంబంధంలేకుండా మద్దతుదారులు మొదటినుండి పెద్దిరెడ్డితోనే ఉంటున్నారు. కాబట్టి పెద్దిరెడ్డిని ఓడించటమే కష్టమంటే డిపాజిట్లు కూడా రాకూడదనటాన్ని ఊహించలేం.





తంబళ్ళపల్లెలో కూడా మంత్రి తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి రెగ్యులర్ గా తిరుగుతునే ఉన్నారు. అవసరమైన పనులను తన అన్నద్వారా చేయిస్తునే ఉన్నారు. కాబట్టి ద్వారక కూడా తంబళ్ళపల్లెలో గెలిచేందుకే అవకాశాలు ఎక్కువున్నాయి. ఇక కుప్పంలో పెద్దిరెడ్డి పెద్ద తమ్ముడు భాస్కరరెడ్డి కొడుకు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిని ఎన్నికల్లో దింపబోతున్నారనే ప్రచారం ఉంది. అదే జరిగితే చంద్రబాబు సుదీర్ ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. మొత్తంమీద వచ్చే ఎన్నికల్లో పుంగనూరు, కుప్పం నియోజకవర్గాలు మాత్రం హైలైట్ అవుతాయనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: