ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ అభివృద్ధి , పాలలో పొరపాట్లు ఉన్నప్పటికీ మళ్ళీ జగన్ సీఎం కావాలని ఆకాంక్షించే ప్రజలు ఉన్నారు. అదే విధంగా ఈ పాలన వలన విసిగి పోయి ఇంకెంత కాలం భరించాలి ఈ సీఎంను ఎన్నికలు వస్తే వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఎదురుచూస్తున్నవారు ఉన్నారు. అయితే జగన్ కు అనుకూలంగా ఎంత శాతం మంది ఉన్నారు మరియు వ్యతిరేకంగా ఎంత శాతం ఉన్నారన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. కానీ రాష్ట్రంలో వచ్చే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అంటూ ప్రతిపక్షము ప్రచారం చేస్తూ ఉంది.

ఇక ఈ మధ్యన చేసిన కొన్ని ప్రైవేట్ సర్వేలలో సైతం ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. అయినప్పటికీ జగన్ ఒకేమాట మీద ఉండడం రాష్ట్ర రాజకీయ నాయకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎప్పటిలాగే వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీనే అధికారాన్ని దక్కించుకుంటుంది అని చెబుతున్నారు. అయితే ఇక్కడ ఎవ్వరికీ అంతుచిక్కని విషయం... జగన్ లో ఇంత నమ్మకం కలగడానికి కారణం ఏమిటని ప్రత్యర్ధులు జుట్టు పీక్కుంటున్నారు. ఏకంగా జగన్ గెలుపు సాధించడం మేమే మరియు ఈసారి మొత్తం సీట్లను మేమే గెలుచుకుంటాము అని చెప్పడం కొసమెరుపు. కానీ రాజకీయ విశ్లేషకులు జగన్ ను గురించి ఏమి చెబుతున్నారంటే... ఎప్పుడైతే ప్రత్యర్థికి భయపడుతామో అప్పుడే సగం ఓటమి పాలయినట్లు లెక్క.

అందుకే దైర్యంగా ఓటమి భయం లేకుండా ఉంటేనే ప్రత్యర్థి మనము ఏదో ప్రణాళికలో ఉన్నామనుకుని వెనకడుగు వేసే అవకాశం ఉంది. ఇప్పుడు జగన్ చేస్తుంది కూడా అదే అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి జగన్ తమ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజల పైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారా లేదా అన్నది తెలియాలంటే మరో సంవత్సరం పాటు వేచి చూడాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: