పవన్ వైఖరి విచిత్రంగా ఉంది. తెలంగాణా మంత్రి హరీష్ రావు, ఏపీ మంత్రుల మధ్య జరిగిన వివాదానికి సంబంధించి అనవసరంగా పవన్ జోక్యం చేసుకున్నారు. విషయం ఏమిటో కూడా తెలుసుకోకుండానే జోక్యం చేసుకోవటమే తప్పయితే ఏపీ మంత్రులను బెదిరిస్తు మాట్లాడటం మరో తప్పు. నోటికొచ్చింది మాట్లాడేయటమే తప్పనుకుంటుంటే తెలంగాణా ప్రజలకు ఏపీ మంత్రులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది.




తెలంగాణా మంత్రి హరీష్ ఓవర్ యాక్షన్ కారణంగానే ఏపీ మంత్రులు రియాక్టయ్యారు. రెండువైపులా మాటల యుద్ధం జరిగింది, ముగిసిపోయింది కూడా. అంతా అయిపోయిన తర్వాత సీన్ లోకి ఎంటరైన పవన్ ఏపీ మంత్రులను బెదిరిస్తున్నట్లుగా మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. మంత్రులు, వైసీపీ నేతలను ఉద్దేశించి విడుదలచేసిన లేఖలో పవన్ మాట్లాడుతు మీకు హైదరాబాద్ లో ఇళ్ళు, వ్యాపారాలున్నాయని గుర్తుచేశారు. ఈ విషయంలోనే మాజీమంత్రి పేర్నినాని మాట్లాడుతు తెలంగాణాలో కూడా ప్యాకేజీ ముట్టిందా అని అడిగింది.





మంత్రి బొత్సాలాంటి వాళ్ళు హైదరాబాద్ లో వ్యాపారాలు చేసిన వాళ్ళే కదా అని అడగటంలో అర్ధమేంటి ? బొత్సా కుటుంబానికి హైదరాబాద్ లో కేబుల్ వ్యాపారం ఉండేదట. మంత్రులు ఎవరైనా అదుపుతప్పి మాట్లాడితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించాలని జగన్మోహన్ రెడ్డిని సీన్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులు, వైసీపీ నేతలకు హైదరాబాద్ లో ఇళ్ళు, వ్యాపారాలు ఉంటే పవన్ కు ఎందుకు ? హైదరాబాద్ లో ఇళ్ళు, వ్యాపారాలు చేసుకుంటున్న ఏపీ జనాలు తెలంగాణా మంత్రులు ఏమన్నా నోళ్ళు మూసుకుని పడుండాలా ?





ఏపీ జనాలకు చెప్పిన బుద్ధే తెలంగాణా మంత్రి హరీష్ కు పవన్ ఎందుకు చెప్పలేదు ? ఏపీ జనాలను హరీష్ ఏమనలేదు. అలాగే తెలంగాణా ప్రజలను కూడా ఏపీ మంత్రులు ఒక్కముక్క కూడా ఏమీ అనలేదు కదా. ఏపీలో పరిపాలన, డెవలప్మెంటును హరీష్ తక్కువచేసి మాట్లాడారు. అందుకనే తెలంగాణాలో పాలనను, డెవలప్మెంటుపైన ఏపీ మంత్రులు మాట్లాడారంతే. చెల్లుకు చెల్లు సరిపోయింది మధ్యలో పవన్ బాధేమిటి ? ఏపీ మంత్రులు అనని మాటలను అన్నట్లుగా పవన్ ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారో అర్ధంకావటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: