తెలంగాణలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ జ్వరాలు తో ఇప్పటికే 50 మందికిపైగా చనిపోయినట్టు కథనాలు వస్తున్నాయి. అయినా వైద్య ఆరోగ్య శాఖ పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరవై రోజుల క్రితం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పని విధానంలో 9.84/10 మార్కులతో ప్రధమ స్థానంలో నిలిచినట్లు వార్తలు వచ్చాయి.


మరి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఇంత అధ్వాన్నంగా ఉంటే.. ఇలాంటి ర్యాంకులు ఎలా ఇస్తారో అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిని ఒక్కసారి పరిశీలిస్తే.. ఉదాహరణకు ఖమ్మం జిల్లాను తీసుకుంటే.. ఖమ్మం జిల్లా గుదిమళ్ళ లో సర్వే చేస్తే వైద్య ఆరోగ్య శాఖ 0.1/10 వస్తాయని ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో వైద్య ఆరోగ్య శాఖ మీద సర్వే చేస్తే 0.2/10 మార్కులు వస్తాయని స్థానికులు మండిపడుతున్నారు.


జ్వరాలు వస్తే మనుషులు చనిపోతున్నారు ఇక ఆధునిక వైద్యం ఎటుపోయిందో మరి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం. డాక్టర్లు మెడికల్ ఆఫీసర్లు ల్యాబ్ టెక్నీషియన్లు అశ్రద్ధ కి పరాకాష్ట ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో వైద్య ఆరోగ్య పరిస్థితి ఉందంటున్నారు. పారిశుద్ధ్య శాఖ మున్సిపాలిటీ / గ్రామాభివృద్ధి శాఖలు పారిశుద్ధ్యాన్ని సక్రమంగా నిర్వహించడం లేదని.. దోమల నివారణ చర్యలు చేపట్టరని...ఫాగింగ్ చెయ్యరని.. స్టోరేజ్ నీళ్లలో కిరోసిన్ ఆయిల్ పోయరని ఆరోపిస్తున్నారు.


ఇటీవల ఖమ్మం జిల్లా నాగులవంచలో ఎనిమిది మంది ఎంబీఏ చేసిన యువకులు ఆ గ్రామాన్ని సర్వే చేసి డెంగ్యూ జ్వరాలు కారణం ఫంక్షన్స్ లో వాడి వదిలిన గ్లాసులు స్టోరేజ్ నీళ్ళని తేల్చారు.. మరి వైద్యారోగ్యశాఖ ఫ్రైడే అని నినాదాలు చెప్పటం పేపర్లకు ఫోటోలు ఇవ్వడం తప్ప ఫ్రైడే డ్రై డే చేయడం లేదు నిర్వహించడం లేదని స్థానికులు మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: