చంద్రబాబు నాయుడు ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లారు.  అయితే, అక్కడ పర్యటనలో ఆయనకు అపశృతులు ఎదురయ్యాయి.  చంద్రబాబు పర్యటన అనుకున్న విధంగా కాకుండా మరో విధంగా మారిపోయింది.  బాబు పర్యటన కోసం ఉత్తరాంధ్ర వెళ్లిన ఆయనకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవ్వడం మొదలుపెట్టాయి.  ఎక్కడి నుంచి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తనదైన శైలిలో పరిష్కరించుకుంటూ ముందుకు సాగిపోయే బాబుగారు, ఇప్పుడు అనూహ్యంగా తన సమస్యకు  పరిష్కారం ఏంటో తెలియక తెగ ఇబ్బందులు పడిపోతున్నారు.  


ఉదయం నుంచి పాపం ఎయిర్ పోర్ట్ లోనే ఉండిపోయారు.  ఎలాగైనా  బయటకు రావాలి అని ప్రయత్నం చేసిన బాబుకు భగంపాటు ఎదురైంది.  కనీసం పాదయాత్రగా బయలుదేరి వెళదామని అనుకున్నా ఆయనకు సాధ్యం కాలేదు.  దీంతో బాబుకు తలనొప్పులుమొదలయ్యాయి.  వెనక్కి వెళ్తే అంతకంటే మరొక అవమానం మరొకటి ఉండదు.  పోనీ ముందుకు వెళ్లాలి అంటే ఎలా వెళ్ళాలి.  వెళ్లే మార్గం ఏంటి అనే ఆలోచనలో పడిపోయాడు బాబు.  


ఇప్పుడు బాబు ముందు ఎలాంటి ఆప్షన్ లేదు.  అక్కడ  ఉండిపోవడం తప్ప.  ఈ వయసులో ఈ సాహసాలు చేడయం అవసరం అంటారా చెప్పండి.  ఏదోలా రోజులు గడుస్తున్నాయికదా .  సాహసం చేయడం ఎందుకు.  ముందుకు వెళ్లలేని పరిస్థితిలు కలిగినపుడు దాని నుంచి బయటకు రావాలి తప్పించి మరోలా ఉండకూడదు.  వైకాపా నేతలు గోబ్యాక్ అని చెప్తున్నా అక్కడి నుంచి కదలకపోవడం విశేషం.  


ఇక్కడ విషయం ఏమిటంటే, ఉత్తరాంధ్రా రాయలసీమ ప్రాంతాల్లో రాజధాని ఇష్యూ నడుస్తున్నది.  ఈ సమయంలో అక్కడ పర్యటించడం వలన తప్పుగా సంకేతాలు వెళ్తాయి.  బాబుకు అడ్డుకోవాలని చూస్తారు.  అందులో సందేహం అవసరం లేదు.  కానీ, బాబు ఇలా చేయడం వలన ఎన్ని ఇబ్బందులు వస్తాయో చెప్పక్కర్లేదు.  కాబట్టి ఇప్పటికైనా బాబు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతే బాగుంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: