అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. భూముల అమ్మకాల్ని అడ్డుకోవాలని నిర్ణయించింది. సమావేశాల్లో ఎక్కువగా రైతుల సమస్యల్ని ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యింది. సమావేశాల సమయంలో జిల్లా కేంద్రాల్లో ఆందోళనకు ప్లాన్ చేస్తోంది... కాంగ్రెస్.

 

హైదరాబాద్‌ గాంధీభవన్ లో భేటీ అయిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు... అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌, ఎమ్మెల్సీ jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి హాజరైన ఈ సమావేశంలో... ప్రధానంగా రైతు సమస్యలపై చర్చ జరిగింది. రైతు బంధు పథకాన్ని ప్రభుత్వం కుదించాలని ఆలోచిస్తోందని ఆరోపించిన కాంగ్రెస్‌ నేతలు... దీనిపై అసెంబ్లీలో క్లారిటీ తీసుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వం భూములు అమ్మి ఖజానా నింపుకోవాలని చూస్తోందని... దీన్ని అడ్డుకోవాలని తీర్మానించారు. ఒకవేళ ప్రభుత్వం భూముల అమ్మకానికి దిగితే... నిరసన పోరాటాలకు కాంగ్రెస్‌ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రైతు బంధు, రెవెన్యూ చట్టం లాంటి అంశాలపై... అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలోనే ధర్నాలు చేసేలా ప్లాన్ చేస్తోంది.

 

రుణమాఫీపై కేసీఆర్ హామీ ఇచ్చి ఏడాది గడిచినా... రుణాలు మాఫీ కాలేదని, ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వడం లేదని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.  రైతుబీమా 59 ఏళ్ల లోపు వారికే వర్తిస్తోందన్నారు. రైతు బంధు ఎవరికి వస్తుందో, ఎవరికి రాలేదో తెలియదన్న ఆయన... ప్రభుత్వం పథకాన్ని కుదించే ఆలోచన చేస్తుందని ఆరోపించారు. మూడెకరాలలోపు ఉన్నవారికే రైతు బంధు ఇవ్వాలనుకుంటే... క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం భూములు అమ్మాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది కాంగ్రెస్‌. ప్రభుత్వం డ్రామాలు ఆపి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.  ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రైతు సమస్యలపై ఫోకస్ చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్... ధర్నాల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: