ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతుంది. అన్ని దేశాలకు కరోనా వైరస్ చుక్కలు చూపిస్తుంది. దీన్ని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. గంట గంటకు కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. మరణాలు కూడా పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రోజు ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 32 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయినట్టు తెలుస్తుంది. 

 

అమెరికాలో ఈ ఒక్క రోజే ఇప్పటి వరకు 11 వేల కరోనా కేసులు నమోదు అయ్యాయని తెలుస్తుంది. ఇక అక్కడ మరణాల సంఖ్య కూడా భారీగా ఉందని సమాచారం. అక్కడ ఇప్పటి వరకు 2,700 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్ లో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య... 84 వేలు దాటింది. గంట గంట కు అక్కడ బాధితుల సంఖ్య పెరగడంతో స్పెయిన్ ప్రభుత్వం ఉక్కిరి బిక్కి అవుతుంది. 

 

అక్కడ మరణాలు దాదాపు 7 వేలకు దగ్గరగా ఉన్నాయి. జర్మని లో మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతుంది. మన భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1200 కి దగ్గరలో ఉంది. మరణాలు 30 నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోన వైరస్ కేసుల సంఖ్య తెలంగాణాలో 70, ఏపీ లో 23 మందికి సోకింది. కొంత మంది ఫలితాలు రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: