ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ అగ్ర రాజ్య‌మైన అమెరికాను కూడా ముప్పుతిప్పులు పెట్టేస్తోంది. అప్ప‌టికే అమెరికాలో క‌రోనా పాజిటివ్ బాధితులు ల‌క్ష దాటేశారు. అక్క‌డ మృతులు కూడా ఆరు వేలు దాటేశారు. ఇక అగ్ర రాజ్యం క‌రోనా దెబ్బ‌తో చిగురు టాకులా వ‌ణుకుతుండ‌డంతో ట్రంప్ అక్క‌డ ప్ర‌భుత్వ ప‌రంగా ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంటున్నా క‌రోనా మాత్రం రోజు రోజుకు పెరిగిపోతోంది. గ‌త రెండు రోజుల్లోనే అక్క‌డ ఏకంగా 2 వేల మంది మృతి చెందారు. 

 

ఇక క‌రోనా విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉంటోన్న ట్రంప్ ఇప్ప‌టికే ఒక‌సారి క‌రోనా టెస్టు చేయించుకోగా నెగిటివ్ వ‌చ్చింది. ఇక ట్రంప్‌కు గురువారం రెండోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని ట్రంప్‌ వ్యక్తిగత వైద్యుడు సీన్‌ పి కాన్‌లీ వెల్లడించారు. 15 నిమిషాల్లోనే రిపోర్టు వచ్చిందని, అమెరికా అధ్యక్షుడికి కరోనాకు సంబంధించి ఎలాంటి లక్షణాలు లేవని స్పష్టం చేశారు. త‌న‌కు క‌రోనా టెస్ట్ చేశాక ట్రంప్ మీడియా స‌మావేశంలో కూడా మాట్లాడారు. 

 

త‌న‌కు నిర్వ‌హించిన టెస్ట్ ఫలితాలు చాలా స్పీడ్‌గా వ‌చ్చాయ‌ని.. అవి చాలా ఖ‌చ్చితంగా ఉన్నాయ‌ని చెప్పారు. అమెరికాలో కరోనా వైరస్‌ తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో మరో నాలుగు వారాల పాటు ఆంక్షల్ని పొడిగిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలకుపైగా కరోనా బాధితులు నమోదు కాగా 50 వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇక అమెరికాలో గురువారం వరకు 2,35,000 మంది వైరస్‌ బారిన పడగా, 5800 మంది మరణించారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: