తెలుగు రాష్ట్రాలలో కరోనా  వైరస్ ప్రభావం  భారీగానే ఉన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి వరకు  తెలుగు రాష్ట్రాల్లో ఒకే స్థాయిలో ఉన్న  వైరస్ ప్రభావం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తగ్గుతూ ఉన్న విషయం తెలిసిందే. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రోజురోజుకూ వైరస్ ప్రభావం పెరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో  వైరస్ టెస్టులు సరిగా చేయడం లేదని లేకపోతే మరిన్ని కేసులు తెర మీదికి వచ్చే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటే అధికార పార్టీ  ఈ ఆరోపణలను ఖండిస్తోంది . అటు  ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి అంటూ ప్రతిపక్షాలు అంటే మేము సరిగ్గానే చర్యలు  చేపడుతున్నామని లేని పక్షంలో మరింత వైరస్ ప్రభావం పెరిగేది అధికారపక్షం అంటుంది. 

 


 ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అసలు పరీక్ష ఇప్పుడే  మొదలవ్వనుంది . ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్  సడలింపు మార్గదర్శకాల లో భాగంగా ఇతర రాష్ట్రాలలో ఉన్న వలస వెళ్లిన కార్మికులను మళ్లీ స్వస్థలాలకు రప్పించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు చేపడుతున్నారు. దీంతో ప్రస్తుతం భవన నిర్మాణాల తో పాటు వ్యవసాయ కూలీ పనులు కూడా మొదలు కానున్నాయి. ట్రాన్స్పోర్టేషన్ కూడా మొదలు కానుంది. 

 


 అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పుడే పెద్ద పరీక్ష మొదలుకానుంది అంటున్నారు విశ్లేషకులు ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లో అసెంప్టమాటిక్  కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా చాలా మందిలో  లక్షణాలు కూడా తొందరగా బయటపడక పోవడం తో చాలా మందికి వ్యాప్తి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి విచిత్రమైన పరిణామాల మధ్య ప్రస్తుతం ఈ సడలింపులు జరగబోతున్నాయి. దీంతో ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండి.. మరింత బాధ్యతగా మరింత జాగ్రత్తగా ఉండి  అన్నింటినీ అదుపు చేయాల్సిన అవసరం  ఉందని ఒకవేళ అదుపు తప్పితే ఇంతకుమించిన క్లిష్ట  పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: