దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శాస్త్రవేత్తలు కరోనా గురించి ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైరస్ మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే అంశం గురించి పరిశోధనలు జరగాల్సి ఉంది. సాధారణంగా కరోనా వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకుతుంది. 
 
శరీరంలోకి కళ్లు, నోరు, ముక్కు ద్వారా ప్రవేశించే ఈ వైరస్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కరోనా వైరస్ శ్వాస వ్యవస్థను దెబ్బ తీసి ప్రాణాలు పోయేలా చేస్తుంది. అయితే తాజాగా చేసిన పరిశోధనల్లో కన్నీళ్లు, రక్తం, మలంలో కూడా కరోనా వైరస్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. శాస్త్రవేత్తలు గతంలో చేసిన పరిశోధనల్లో జికా, ఎబోలా మనిషికి లైంగికంగా సంక్రమించే అవకాశం ఉందని తేలింది. 
 
చైనాలోని జామా నెట్వర్క్ ఓపెన్ లో శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలను ప్రచురించారు. శాస్త్రవేత్తలు మనిషి వీర్యంలో కరోనా వైరస్ ను గుర్తించినట్టు చెబుతున్నారు. చైనాలోని ఒక ఆస్పత్రిలో 38 మంది కరోనా బాధితుల వీర్యాన్ని పరీక్షించగా వారిలో ఆరుగురి వీర్యంలో కరోనా ఉన్నట్టు తేలింది. అయితే లైంగికంగా కరోనా సంక్రమిస్తుందో లేదో తేలాల్సి ఉందని... మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. 
 
చైనాలోని ఉటా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ హోటాలింగ్ కరోనా వైరస్ గురించి మరిన్ని పరిశోధనలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 56,342కు చేరింది. వీరిలో 16,540 మంది కరోనా నుంచి కోలుకోగా 1886 మంది మృతి చెందారు. ఏపీలో, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ఏపీలో 54 కరోనా కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 1887కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: