దేశంలో రోజురోజుకీ వైఎస్ జగన్ క్రేజ్ పెరిగిపోతుంది. కరోనా వైరస్ కట్టడి చేయడంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయటంలో వైయస్ జగన్ తన మార్క్ ఐడియా ఉండేలా వ్యవహరిస్తున్నారు. కేవలం అతి తక్కువ టైమ్ లోనే వైఎస్ జగన్ తన కంటే దేశవ్యాప్తంగా గౌరవం ఉండే విధంగా రాణించడం జరిగింది. అధికారంలోకి రావడానికి వైఎస్ జగన్ అప్పట్లో అనేక కష్టాలు పడడం జరిగింది. దేశంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా జగన్ పడిన కష్టాలు పడలేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అన్ని కష్టాలు పడ్డ జగన్ పరిపాలన చూసి దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి అంటే మామూలు విషయం కాదు. కేవలం ఒకే ఒక్క ఏడాదిలో దేశంలోనే అగ్రస్థానంలో కి వెళ్ళిపోయారు.

 

జగన్ మొదటిలో అధికారంలో వచ్చిన సమయంలో వయసు తక్కువ పైగా అనుభవం లేకపోవడంతో ప్రత్యర్థులు నవ్వారు. అనేక డైలాగులు కూడా వేయడం జరిగింది. అలాంటి వారు ప్రస్తుతం జగన్ పరిపాలన చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక కేవలం ఒకే ఒక్క ఏడాదిలో దేశంలో మోస్ట్ పాపులర్ సీఎం లలో జగన్ చేరుకోవడం జరిగింది. ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో మోస్ట్ పాపులర్ ముఖ్యమంత్రులలో జగన్ మూడవ స్థానంలో నిలిచారు. ఈ సర్వేలో 70 శాతం పైగా దేశవ్యాప్తంగా సీఎం జగన్ పరిపాలన పట్ల సంతృప్తిగా ఉన్నారు అన్న విషయం బయటపడింది. ముఖ్యంగా సీఎం జగన్ ఆధ్వర్యంలో అమలవుతున్న నవరత్నాలు జాతీయస్థాయిలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

 

ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా జగన్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను పరిశీలిస్తున్నారట. ఇది ఎలా సాధ్యం అవుతుందో తెలుసుకుందాం దేశవ్యాప్తంగా మనం కూడా అమలు చేయాలని కేంద్రంలో ఉన్న పెద్దలు అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా పరిపాలిస్తే దేశం అభివృద్ధి జరుగుతుందని కేంద్రంలో ఉన్న నాయకులు భావిస్తున్నట్లు అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా నుండి అరుదైన గౌరవం జగన్ కి వచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: