ఈ దేశంలో 135 కోట్ల మంది జనం ఉన్నారు. వారిలో నూటికి తొంబై శాతం మంది పేదలు, మధ్యతరగతి వర్గాలు ఉన్నారు. అసలే దిన దిన గండం, దీర్ఘాయిష్షు అన్నట్లుగా వీరంతా బతుకులు దిగాలుగా  వెళ్ళదీస్తారు. అటువంటి వారిని కరోనా కాటు వేసింది. దాంతో మరింత పాతాళానికి బతుకులు జారిపోయాయి. ఏలిన వారి వైపు ఆశగా ఎదురుచూస్తున్న ఆపన్నులను ఆదుకునేందుకు కేంద్రం  ముందుకు రాదా అని దీనాలాపనలు వినిపిస్తున్నాయి.

 

ప్రధాని మోడీ కొద్ది రోజుల క్రితం 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజి అని భారీ ప్రకటన చేసే అంతా ఆశపడ్డారు. ముఖ్యంగా మధ్యతరగతి, పేద వర్గాలు తమకు ఏదో సాయం అందుతుంది అని ఆశించాయి. అయితే కేంద్ర బడ్జెట్ ని చదివినట్లుగా గత మూడు రోజులుగా ఠంచనుగా సాయంత్రం నాలుగు గంటలు  అయితే చాలు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలమ్మ తయారు అయిపోయితున్నారు. అందులో చెబుతున్నవి, అమలు చేస్తామని అంటున్నవి తక్షణం జరిగేవి కార్యక్రమాలు  చాలా తక్కువ ఉన్నాయి.

 

అన్నీ కూడా దీర్ఘకాలంలో చేయాల్సినవి, చేస్తామని చెబుతున్నవి, ఇక రుణాల మాఫీ చేసినా చేయకపోయినా డబ్బు కట్టడానికి ఉబ్బిపోయిన వారు కరొనా వేళ ఇపుడు  ఎవరు ఉన్నారు. ఇలా అనేక పధకాలు వల్లె వేస్తున్న నిర్మలమ్మకు నగదు బదిలీ పధకం మాత్రం గుర్తుకు రావడం లేదు. అసలు ఆ పధకం పేరు చెప్పి 2014లో మొదటి సారి ప్రధాని అయిన మోడీకి కూడా ఇపుడు గుర్తు లేదు, నిర్మలమ్మ ఏం చేస్తారు లెండి.

 

నగదు బదిలీ పధకమే ఈ సమయంలో ఆర్ధిక వ్యవస్థ ఎత్తిగిల్లడానికి సరైన మందు అని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. లాక్ డౌన్ అని ప్రపంచ దేశాలను చూసి తలుపులు మూసేసిన కేంద్రం అక్కడ లాక్ డౌన్ తరువాత ప్రజలను ఆదుకుంటున్న విధానాలు కొన్ని అయినా భారత్ లో అమలు జరిపారా అన్నది ఇక్కడ ప్రశ్న. అమెరికా తన పౌరులకు ఒక్కొక్కరి ఖాతాలో 90 వేల రూపాయలు వేస్తోంది. అక్కడ మనతో పోలిస్తే లాక్ డౌన్ ప్రభావమే చాలా తక్కువ.

 

ఇక కెనడాలో కూడా ప్రతి వ్యక్తి ఖాతాలో సొమ్ము వేశారు. ఇదే తీరున మరికొన్ని దేశాలు ప్రైవేటు ఉద్యోగులకు తాము కూడా సగం జీతం చెల్లిస్తూ ఆదుకుంటున్నాయి. మరి భారత్ లో మాత్రం అంతా ఉల్టా సీదా. ఇక్కడ పధకాలు ప్రకటించబడును, బడ్జెట్ పత్రాలు  వరసగా చదవబడును అన్నట్లుగా సీన్ ఉంది.

 

 

బడ్జెట్ పత్రాలలో జరిగేవన్నీ నెరవేరేసరికి పేదలు, మధ్యతరగతి పై లోకాలకే పయనం అవుతారని అంటున్నారు. వివిధ వర్గాలకు రాయితీలు అంటున్న కేంద్రం మధ్యతరగతిని కనీసం ద్రుష్టిలో పెట్టుకోకపోవడాన్ని కూడా తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా నగదు బదిలీ పధకాన్ని అమలు చేసి మోడీ తన మాట నిలబెట్టుకోవాలని అంతా కోరుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: