ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన అంశం పోతిరెడ్డిపాడు నీటికి సంబంధించి... అయితే ఈ ప్రాజెక్టు విషయంలో.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగానే ముందుకు వెళ్తున్నారు. తమ జల హక్కు మేరకు మాత్రమే నీటిని వినియోగించుకుంటామని.. అక్రమంగా నీటిని వినియోగించుకుంటే  న్యాయపోరాటం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. 

 


 అయితే మొదటి నుంచి పోతిరెడ్డిపాడు నీటి హక్కు విషయంలో మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు మౌనాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ విషయంలో ఎటు  తేల్చుకోలేకపోతున్నారు చంద్రబాబు . తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోతిరెడ్డి పాడు, కృష్ణ డెల్టా  విషయంలో నాటకం ఆడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు తప్ప.. తన వైఖరి ఏమిటి అన్నది మాత్రం చెప్పడం లేదు చంద్రబాబు నాయుడు. దీనిపై రాజకీయ విశ్లేషకులు కూడా మండిపడుతున్నారు. 

 

 ఎందుకంటే ఈ జల హక్కు విషయంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఒక చుక్క నీరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోవడానికి వీలు లేదు అంటూ ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని డిమాండ్ చేస్తున్నాయి తప్ప...  అధికార పార్టీ తీరును తప్పు పట్టడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ మాత్రం.. ఆ నీటిని వినియోగించడం తమ హక్కు అని మాత్రం చెప్పలేకపోతోంది. కారణం గతంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కు వ్యతిరేకంగా టిడిపి పార్టీ నిరసన కార్యక్రమాలు ఆందోళనలు చేపట్టింది. అయితే చంద్రబాబు నాయుడు సత్వరంగా ఈ విషయంలో తన వైఖరిని బయట పెడితే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.లేక పోతే మీకే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది అంటు చెబుతున్నారు విశ్లేషకులు...

మరింత సమాచారం తెలుసుకోండి: