ఒకపక్క భారత్ తో సరిహద్దుల విషయంలో ఇంకా చర్చలు కొనసాగుతున్నప్పుడే చైనా కుట్రలు పన్నుతోంది. సరిహద్దు వెంట భారీగా బలగాలు మొహరిస్తూ ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతోంది అని మొదటి నుండి బలమైన ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. సమయంలో గల్వాన్ లోయ వద్ద జరిగిన గొడవ లో 20 మంది భారత సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే. చైనా అంతా పథకం ప్రకారం చేసిందని చాలా వర్గాలు ఆరోపణలు వస్తున్నాయి. అయితే మన వాళ్ళు వారికన్నా మంచి శిక్షణ ఉన్న వారు కావున చైనా కి మనకన్నా రెట్టింపు ప్రాణ నష్టం జరిగింది.

 

అయితే ఇప్పుడు చైనా భారత సైనికులను ఎదుర్కొనేందుకు మరియు వారిపై దాడి చేసేందుకు తమ సైనికులను బలంగా తయారు చేస్తోంది. నేపథ్యంలో వారికి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తోంది. శిక్షణ ఇచ్చేందుకు టిబెట్ పీఠభూమి నుండి 20 మంది మార్షల్ ఆర్ట్స్ నిపుణులను పంపిస్తున్నట్లు చైనా తెలపడం జరిగింది. కార్యక్రమం అంతా గత కొద్ది రోజుల్లో కూడా జరగడం గమనార్హం.

 

విషయం ఏమిటంటే 1996లో కుదిరిన ఒప్పందం ప్రకారం రెండు దేశాలు సరిహద్దు ప్రాంతాల్లో తుపాకులు మరియు పేలుడు పదార్ధాలు ఉపయోగించకూడదు. క్రమంలో ఏదైనా గొడవ జరిగితే కేవలం ఘర్షణలాగే ఉంటుంది. చైనా వారితో పోలిస్తే భారత సైనికులు దృఢంగా ఉంటారు కాబట్టి వారిని దెబ్బకొట్టేందుకు సైన్యానికి ఇలా ప్రత్యేK శిక్షణ ఇస్తుంది.

 

ఇక్కడ పాయింట్ ఏమిటంటే గొడవ జరిగిన ప్రాంతం వద్ద మరియు వివాదంలో ఉన్న భూభాగం వద్ద రెండు దేశాలు సైనికులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే చైనా వారు ఇప్పటికే కవ్వింపు చర్యలకు పాల్పడుతూ మరియు భారతీయులపై ప్రతీకారం తీర్చుకోవాలని ఉన్నారట. మన వాళ్ళు 20 మంది చనిపోతే వారు 40 మందికి పైగా చనిపోయారు. మొన్న గొడవలో ముల్లు చుట్టిన కర్రలతో,ఇనుపరాడ్లతో భారత సైనికుల పై దాడి చేసిన వారు సారి మాత్రం మార్షల్ ఆర్ట్స్ తో దెబ్బకొట్టాలని చూస్తున్నారు.

 

పరిస్థితుల మధ్య చైనా తమ సైనికులకు కఠోర పరిస్థితులను తట్టుకునేలా తీవ్రమైన శిక్షణ ఇస్తోంది. భారత్ సైనికుల దాడిని తీవ్రంగా ఎదుర్కొనడానికి శిక్షణ ఇప్పిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: