బీర్ అంటే మద్యపాన ప్రియులకు ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కువగా  వేసవి కాలంలో బీర్‌లకు బాగా డిమాండ్. అయితే బీర్ బాటిల్స్  ఎందుకు బ్రౌన్ లేదా గ్రీన్ కలర్‌లోనే ఉంటాయి....? దీనికి గల కారణాలు ఇవే.....  ఈ బీర్ బాటిల్స్ లో మొత్తం  3 రకాల రంగులకు చెందిన బాటిల్స్  మాత్రమే ఉంటాయి. వివరాల్లోకి వెళితే.... ఈజిప్టు, మెసొపొటామియాలలో క్రీస్తు పూర్వం 9000వ సంవత్సరం లోనే  బీర్‌ను తయారు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడులాగ అప్పట్లో ఫ్రిజ్‌లు  లేవు. తయారు చేసి బీర్ ని వెంటనే తాగేవారు. అప్పట్లో ఒక సన్యాసి బీర్‌ను గాజు వైన్ బాటిల్‌లో నింపాడట. తరువాత ఆ విషయాన్ని అతను మరిచిపోయాడట. తరువాత ఆ విషయం గుర్తుకు వచ్చి బీర్‌ను చూస్తే ఆ బీర్ ఇంకా తాజాగా ఉందట.

ఇలా ఆ తరువాత 1850లలో బీర్‌ను సీసాల్లో నింపడం ప్రారంభమైంది.  దీని మూలంగానే  అప్పటి నుంచి బీర్‌ను గ్రీన్‌ కలర్‌లో ఉండే సీసాల్లో నింపి అమ్మడం మొదలు పెట్టారు. బీర్‌ను 1930ల వరకు గ్రీన్‌ కలర్ సీసాల్లోనే నింపేవారు. కానీ  యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా, బెల్జియంలోని ఘెంట్ యూనివర్సిటీ కెమిస్ట్‌లు డార్క్ బ్రౌన్ కలర్‌లో ఉండే సీసాల్లో ఉంచితే  మరింత ఎక్కువ సేపు తాజాగా ఉంటుందని చెప్పారు.అది కాకుండా సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల ప్రభావం పడకుండా ఉంటుందని గుర్తించారు. అందుకని అప్పటి నుండి వీటిని వాడేవారు.  

ఇది ఇలా ఉండగా  రెండో ప్రపంచ యుద్ధం తరువాత బ్రౌన్ గ్లాస్‌కు కొరత రావడం మొదలైంది. అందుకే  గ్రీన్ కలర్ బాటిల్స్ ను బీర్ కోసం వాడేవారు. తరువాత బ్రౌన్ కలర్‌ సీసాలనే వాడినా  గ్రీన్ కలర్ సీసాలను ప్రెస్టిజ్‌కు సింబల్‌గా వాడుతూ వస్తున్నారు కొందరు. అయితే ప్రస్తుతం డార్క్ బ్రౌన్‌, గ్రీన్‌, క్లియర్ సీసాల్లోనూ బీర్‌ను అందిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: