ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హైదరాబాద్ నగరం, జిల్లాలో అక్రమ కట్టడాలు, భూకబ్జాలు ఎక్కువగా జరుగుతున్నాయని నేపథ్యంలో రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వ అనుమతులతో రిజిస్ట్రేషన్ కోసం ధరణి పోర్టల్ పని కొత్త రిజిస్ట్రేషన్ యాప్ లు తీసుకువచ్చారు.ఇది తరహాలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమగ్ర భూ సర్వే చేయించి రాష్ట్రంలో ఉన్న అక్రమ కట్టడాలను అడ్డుకునే విధంగా ప్రణాళిక రూపకల్పన చేశారు. వచ్చే ఏడాది  జనవరి 1న సమగ్ర భూసర్వే మొదలు కావాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు.


నిర్ణీత వ్యవధిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. వందేళ్ల తర్వాత సర్వే జరుగుతోందని.. దీనివల్ల రాష్ట్రంలో పక్కాగా భూరికార్డుల డిజిటలైజేషన్‌ అవుతుందని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అత్యాధునిక టెక్నాలజీ, డ్రోన్‌లు, రోవర్స్‌ ఉపయోగించి దేశంలో తొలిసారిగా ఈ సర్వే నిర్వహిస్తున్నామని వెల్లడించారు. త్వరలోనే సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి కాబట్టి, ఆ మేరకు సర్వేయర్లు కూడా ఉండాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
గతంలో రికార్డులు ట్యాంపర్‌ చేయడానికి చాలా అవకాశం ఉండేదని, ఆ పరిస్థితి పూర్తిగా మారాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. ఎవ్వరు కూడా రికార్డులు తారుమారు చేసే అవకాశం లేకుండా డిజిటైజేషన్ జరుగుతుందని అన్నారు.


వ్యవసాయ భూములు, గ్రామ కంఠాలు, మున్సిపాలిటీలలో ఈ సర్వే కొనసాగుతుందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా1.22 లక్షల చదరపు కిలోమీటర్లలో సర్వే కొనసాగుతుందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, పక్కాగా సర్వే చేస్తామని తెలిపారు. ప్రతి మండలంలో మూడు బృందాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 4500 బృందాలు పని చేస్తాయని వెల్లడించారు.  సమగ్ర భూ సర్వే 3 దశల్లో కొనసాగుతుందని. ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా సర్వే ఉంటుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: