ఆంధ్రప్రదేశ్ లో బిజెపిలోకి ఎవరు వెళ్తారు అనే దానిపై చాలానే చర్చలు జరుగుతున్నాయి. బిజెపిలోకి వెళ్లే నేతలెవరూ అనేదానిపై బిజెపి నేతలు కూడా కాస్త ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బిజెపిలోకి ఇప్పుడు చాలా మంది నేతలు వెళ్లడానికి ప్రధానంగా భయపడుతున్నట్లు గా తెలుస్తుంది. ప్రధానంగా సోము వీర్రాజు గురించి కొంత మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు గా సమాచారం. బీజేపీలోకి వెళితే  సోము వీర్రాజుమాట వినాల్సిందే అనే విధంగా పరిస్థితులు ఉన్నాయి. దీనితోనే ఇప్పుడు బీజేపీ లోకి వెళ్ళడానికి చాలా మంది వెనక అడుగు వేస్తున్నారని సమాచారం.

ఇటీవల పార్టీ నుంచి కొంత మందిని ఆయన సస్పెండ్ చేశారు. తాజాగా పార్టీ నుంచి లంకా దినకర్ ని సస్పెండ్ చేయడం సంచలనం సృష్టించింది. టీవీ డిబేట్ లో పాల్గొంటున్నారు అనే కారణం చూపించి ఆయనను సస్పెండ్ చేసింది పార్టీ అధిష్టానం. ఇక దీనితో ఇప్పుడు పార్టీలో ఉన్న నేతలు కూడా ఎక్కడైనా ఏదైనా మాట్లాడాలి అంటే కాస్త భయపడే పరిస్థితి ఉంది. టీవీలకు ఏదైనా ఇంటర్వ్యూ ఇవ్వాలని భావించిన సరే వాళ్ళు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాంతాలవారీగా సోము వీర్రాజు పార్టీని విభజించారు అని ఆరోపణలు కూడా కొంత మంది చేస్తున్నారు.

దీనితోనే ఇప్పుడు బీజేపీ లోకి వెళ్ళడానికి చాలా మంది నేతలు వెనకడుగు వేస్తున్నట్టు గా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే బిజెపి బలపడాలి అంటే కచ్చితంగా ఇతర పార్టీల నేతలు అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి తరుణంలో ఆయన పార్టీ నుంచి సస్పెన్షన్ లు చేసుకుంటూ పోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ నేతలు కొంతమంది బిజెపి లోకి వెళ్ళాలి అని భావించారు. కానీ సోము వీర్రాజు దెబ్బకు వాళ్ళు వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: