రాజకీయ నాయకుల కుటిల రాజకీయాలకు దేవుళ్లను అడ్డం పెట్టుకోవడం మొదటి నుండీ మామ్మలే. సరిగ్గా ఎన్నికలకు చేరువవుతున్న తరుణంలో రాజకీయ నాయకులు తమ బుర్రకు పదును పెట్టడం మొదలు పెడతారు. ఏ విషయం అయితే ప్రజలు పట్టించుకుంటారో ఆ విషయాన్ని కాంట్రవర్సీ చేసి క్యాష్ చేసుకోవాలని చూస్తారు. ఇక్కడ సరిగ్గా అలాంటి తంతే జరిగింది. ఇంతకీ విషయం ఏమిటని అనుకుంటున్నారా...

బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి పార్టీలు పలు రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నాయి. అందులో భాగంగా లోక్ జన శక్తి చీఫ్ అయినటువంటి చిరాగ్ పాశ్వాన్ అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం కంటే పది రెట్లు పెద్దదైన సీతామాత ఆలయాన్ని నిర్మిస్తామని లోక్ ప్రకటించడం పలు చర్చలకు దారి తీస్తోంది. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ బీహార్ లోని సీతామర్హిలో సీతమ్మ ఆలయాన్ని నిర్మిస్తామని ప్రకటించారు.

ఈ సందర్భంగా అతను రాముడి గురించి ప్రస్తావించారు. సీత లేకుండా రాముడు పరిపూర్ణుడు కాడని, అందుకే అయోధ్య రామాలయం కన్నా 10 రెట్లు పెద్దదిగా వున్న సీతామాత ఆలయాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. అయోధ్య రామాలయాన్ని, సీతామర్హిలోని సీతమ్మ ఆలయాన్ని కలుపుతూ ఓ పెద్దదైన కారిడార్ నిర్మాణం కూడా జరగాలని ఈ సందర్భంగా కేంద్రానికి పిలుపునిచ్చారు.

బీహార్ లో తమ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఒకింత ధీమాని వ్యక్తం చేసారు. తమ ప్రభుత్వం రాగానే మొదటగా సీతామాత ఆలయానికి శంకుస్థాపన చేస్తామని ఈ సందర్భంగా చిరాగ్ పాశ్వాన్ మాటిచ్చారు. ఒకవేళ నితీశ్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేని దుస్థితి తలెత్తితే మాత్రం బీజేపీతో కలసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇకపోతే ఇతగాడి స్టేట్ మెంట్ కు పలు హిందూ ధర్మ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాముడిని సీతాదేవిని వేరుపరిచి మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: