దుబ్బాక ఉప ఎన్నికల విషయంలో అన్ని పార్టీ లకు హోరా హోరీ తప్పదని తెలుస్తుంది.  కేసీఆర్ ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. స్వయంగా దుబ్బాక మండలానికి తానే బాధ్యుడిగా ఉంటున్నారు. తనకు సన్నిహితులైన ఇతర నేతలకు ఇతర మండలాల బాధ్యతలు ఇచ్చారు. అభ్యర్థిని కూడా తానే ఎంపిక చేశారు.  ఒక విధంగా తెలంగాణాలో ఇప్పుడు ఆసక్తికర రాజకీయం కొనసాగుతుందని చెప్పొచ్చు.. ఓ వైపు దుబ్బాక ఉప ఎన్నిక, మరో వైపు గ్రేటర్ ఎన్నికలు, ఇంకో వైపు ఎమ్మెల్సీ ఎన్నికలతో తెలంగాణ లో రాజకీయం రోజు రోజు కు ఎంతో ఆసక్తి కరంగా మారుతున్నాయి..

ఇప్పటికే గ్రేటర్, దుబ్బాక ఉప ఎన్నికలకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేయగా అక్కడ ప్రచార పర్వం ఇప్పటికే మొదలైపోయింది చెప్పొచ్చు. అన్ని పార్టీ లు తమ తమ ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకోగా అభ్యర్థుల ఎన్నిక విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి.. అధికార పార్టీ కి ఈ ఎన్నికల పై పెద్దగా టెన్షన్ లేకపోయినా బీజేపీ కాంగ్రెస్ ల మధ్య భీక పోరు జరగనున్నదన్నది వాస్తవం.. సరైన నాయకుడు, నాయకత్వం లేకపోవడం వలన కాంగ్రెస్ పరిస్థితి ఇలా తయారైందని వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుల విభేదాలు, రోడ్డున పడి రాని లేని అధికారం కోసం పోట్లాడి ప్రజల దృష్టిలో మరింత చీప్ అయిపోయారు.. ఇక పార్టీ ఇలా అయిపోవడానికి ముఖ్య కారణంగా ఉత్తమ్ కుమార్ ను నిందిస్తున్నారు కొందరు కాంగ్రెస్ నాయకులు..

ఉత్తమ్ సరిగ్గా రాజకీయం చేసి ఉంటె రాష్ట్రంలో పార్టీ పరిస్థితి వేరేలా ఉండేదని జోస్యం చెప్పారు.. అసెంబ్లీ ఎన్నికల్లో కనీస మద్దతు ను కూడగట్టలేకపోయారు, సరైన అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయారు అని ఆయనపై కొంతమంది కాంగ్రెస్ నాయకులూ విమర్శలు చేశారు..ఈ తరుణంలో తమకు కూడా వ్యతిరేకత ఉంది అనే విషయం టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం గ్రహించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇన్ని రోజులు ప్రజలకు దూరంగా ఉన్న నాయకులందరూ ఎన్నికల ముందు ప్రజల దగ్గరకు వచ్చి మళ్ళీ హామీలు కురిపిస్తారు. ఎన్నికలనగానే ప్రచారం చేస్తే సరిపోతుంది అనే భావనలో టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఉంది. వాస్తవానికి గత ఆరేళ్ళ కాలంలో టిఆర్ఎస్ పార్టీ సాధించిన పెద్ద విజయాలను ఏమీ లేవు అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: