ఒక్కోసారి మన అదృష్టం సరిగా ఉండదు . కొందరికేమో అదృష్టం ఎదో ఒక రూపం లో వరిస్తుంది దానిని మనం అందుకున్నపుడే మన జీవితంలో ఆ అదృష్టం  అందనంత ఎత్తులో మనల్ని నిలబెడుతుంది అలాంటిదే  ఈ కార్మికుడి జీవితం లోను  జరిగింది.. నాడు లంకె బిందెల కోసం చాలా మంది వెతికే వారు.. అందులో  దొరికే బంగారం మరియు వజ్రవైడుర్యాలు అమ్మి ఆ వచ్చే డబ్బుతో జీవితం లో స్థిరపడవచ్చు  అని చాలా మంది కలలు కంటుంటారు ..

అయితే లంకె బిందెలు నిజంగా ఉన్నాయా అంటే లేవు అనే  చెప్తాను. ఇక వాటి గురించి పక్కన పెడితే ఈ మధ్య పేపర్లలో వ్యవసాయం చేసే అతను కోటీశ్వరుడు అయ్యాడు. అని ఈ  విధంగా కొన్ని వార్తలు వస్తుంటాయి. మీరు కూడా చూసే ఉంటారు అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా. ఏమి లేదండి వాళ్ళు పొలం దున్నే సమయం లో ఎదో విచిత్రమైనది దొరుకుతుంది.  అది ఏంటి అని చూస్తే పురాతన వజ్రం అవుతుంది ..ఈరోజుల్లో వజ్రానికి ఉన్న విలువ తెలుసు కదా ఆ చిన్న బండరాయి అనుకునే అది వజ్రం అయి అప్పటికప్పుడే అతన్ని కోటీశ్వరుడిని చేస్తుందన్నమాట... ఇప్పుడు ఇలాంటిదే ఒక సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది మరి అదేంటో తెలుసుకుందామా ..

వజ్రాల గనుల్లో శ్రమించే ఓ నిరుపేద కార్మికుడిని అదృష్టం వరించింది. మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాల గనుల్లో పనిచేసే బల్బీర్‌సింగ్‌ యాదవ్‌కు గురువారం ఏకంగా 7.2 క్యారెట్ల వజ్రం లభించింది. ఆ వజ్రాన్ని చూడగానే అతని సంతోషానికి అవధులు లేవు.  వజ్రాన్ని చూడగానే బల్బీర్‌సింగ్ సంతోషంతో  ఎగిరి గంతేశాడు. అనంతరం అధికారుల వద్దకు వెళ్లి తనకి దొరికిన వజ్రాన్ని చూపించాడు.. పతి బజారియా ప్రాంతంలోని కృష్ణ కల్యాణ్‌పూర్‌ గనుల్లో ఈ వజ్రం లభించినట్టు డైమండ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనుపమ్‌సింగ్‌ తెలిపారు.

ఇక వజ్రం విలువ ఎంతనేది తెలియగానే. బల్బీర్‌సింగ్‌ మరియు అతని భార్య  సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యారు .ఈ వజ్రం విలువ దాదాపుగా 35  నుంచి 40  లక్షల వరకు ఉంటుందని అధికారులు   తెలిపారు. ఈ వజ్రాన్ని వేలం వేసి, 12.5 శాతం రాయితీ మినహాయించి మిగతాది బల్బీర్‌సింగ్‌ దంపతులకు అందజేస్తామని పేర్కొన్నారు. చూశారు కదా ఒక్క వజ్రం తో అతని జీవితమే మారిపోయింది .దేనికైనా అదృష్టం ఉండాలి అంటారు







 

మరింత సమాచారం తెలుసుకోండి: