సోషల్ మీడియాలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు వెనుకబడి ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా పార్టీలో ఉన్న అగ్ర నేతలు చాలామంది సోషల్ మీడియాను వాడుకొనే విషయంలో ఘోరంగా వెనక పడుతున్నారు. ప్రభుత్వ పథకాలను ఇప్పుడు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటిని సోషల్ మీడియాలో విమర్శించే విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలు దారుణంగా వెనుకబడి ఉండటం తో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఈ బాగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

కీలకమైన సమయంలో కూడా సోషల్ మీడియాలో ఇలా ఇబ్బంది పడటం తో పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీ నేతలు అందరికీ కూడా సోషల్ మీడియాకు సంబంధించి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసే విధంగా చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు గా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ కీలక నేతలతో కూడా ఆయన చర్చించినట్లు సమాచారం. అయితే సోషల్ మీడియాకు సంబంధించి కొన్ని కొన్ని సూచనలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

అలాగే పార్టీకి సంబంధించి ఒక కొత్త బృందాన్ని కూడా ఇప్పుడు ఏర్పాటు చేసే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారట. దీనికి సంబంధించి నారా లోకేష్ కసరత్తు మొదలు పెట్టారని టాక్. సోషల్ మీడియా బాధ్యతలను మొత్తం గల్లా జయదేవ్ లేదా రామ్మోహన్ నాయుడు కి అప్పగించే విధంగా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుని ముందడుగు వేసే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీని ఎదుర్కోవాలి అంటే తెలుగుదేశం పార్టీ బాగా దూకుడువెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే సోషల్ మీడియా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: