ఏపీలో ఈ మధ్య కాలంలో పోలీసులు వివాదాల్లో ఎక్కువగా ఉంటున్నారు. అటు అధికారులు కూడా వివాదాలతోనే ఎక్కువగా సావాసం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అధికారుల విషయంలో ఇప్పుడు హైకోర్ట్ కొన్ని కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేస్తుంది. తాజాగా మరో వివాదం బయటకు వచ్చింది. గతంలో జీవీఎంసీ షాపులు తొలగించిన ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్  లో గోడ నిర్మాణాన్ని అడ్డుకున్న షాపు యజమానులు, తెలుగుదేశం  ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

కోర్టు స్టేటస్ కు ఉంటుండగా ఎలా నిర్మాణాలు చేపడతారని ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు. గతంలో జలవనరుల శాఖ ఆదేశాల మేరకు షాపులను జీవీఎంసీ అధికారులు కాస్త దూకుడుగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ... డిసెంబర్ 11 వరకు హైకోర్టు స్టే ఉంటే ఈ గోడ ను ఎలా నిర్మిస్తారు అని ఆయన ప్రశ్నించారు. హై కోర్ట్ స్టే కూడ ప్రభుత్వం ధిక్కరిస్తుందా అని నిలదీశారు. ఏయూ గోడ నిర్మాణం చేయబడుతుంది, ఏయు కి ఈ షాప్స్ కి సంబంధం లేదు అని ఆయన స్పష్టం చేసారు.

60 ఏళ్ళు గా ఉన్న ఈ షాప్స్ వద్ద మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారని విజయ్ సాయి రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు అని ఆయన  మండిపడ్డారు. ఈ చుట్టు పక్కల ఎస్పీ కార్యాలయం, 3 టౌన్ ఉండగా మాదక ద్రవ్యాలు ఎలా విక్రయాలు జరుగుతాయి అని ఆయన నిలదీశారు. శనివారం అంటేనే విశాఖ లో ప్రజలు భయపడుతున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది అని ఆయన మండిపడ్డారు. పేద ప్రజల పొట్ట కొడుతుంది ఈ ప్రభుత్వం అని ఆయన మండిపడ్డారు. కాగా ఇటీవల విశాఖలో శనివారం ఎక్కువగా అక్రమ కట్టడాలను కూలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: