గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీయారెస్ మూడవ వంతు విజయం మాత్రమే దక్కించుకుంది. అంతే కాదు, మ్యాజికి ఫిగర్ కి చాలా దూరంలో నిలిచింది. ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు టీయారెస్ కి ఉన్నా కూడా వారిని కలుపుకున్నా కూడా 88 దగ్గరే ఆగిపోతుంది. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 45మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఇందులో మజ్లీస్ కి పది మంది ఉంటే బీజేపీకి ముగ్గురు  ఉన్నారు. ఈ నేపధ్యంలో వారితో కూడా కలుపుకుని చూస్తే మొత్తం 195 మంది సభ్యులు అవుతారు. అందులోనుంచి మ్యాజిక్ ఫిగర్ తీయాలంటే 98 మంది సభ్యుల మద్దతు కావాలి.

ఇపుడు టీయారెస్ కి నికరంగా వచ్చినవి 57 సీట్లే. మరో 31 మంది ఎక్స్ అఫీషియో సభ్య్లను కలుపుకుంటే 88 కి నంబర్ చేరుతుంది. అంటే మేయర్ పీఠానికి చేరడానికి  కచ్చితంగా పది మంది సభ్యుల మద్దతు టీయారెస్ కి కావాలి. అంటే మజ్లీస్ పార్టీ సహకారం ఉంటేనే మేయర్ పీఠం టీయారెస్ పరం అవుతుంది.  మజ్లీస్ పార్టీకి 42 సీట్లు వచ్చాయి. అలాగే మజ్లీస్ కి పది మంది ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు కూడా ఉంది. అలా కనుక చూసుకుంటే  140 మంది దాకా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ లో  ఈ రెండు పార్టీలకు బలం వస్తుంది. బీజేపీకి ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకుని 51 మంది సభ్యుల మద్దతు గ్రేటర్ హైదరాబాద్ లో ఉంటుంది.

దాంతో కొత్త కార్పోరేషన్ లో బీజేపీ ఏకైన విపక్ష పాత్రధారి అవుతుంది. మజ్లీస్ టీయారెస్ కి మద్దతు ఇవ్వాలంటే డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలో లేక వంతుల వారీగా మేయర్ పదవి ఇవ్వాలో కూడా రాజకీయ బేరం సాగితేనే తప్ప తేలదు. మొత్తానికి కమల కుతూహలంతో టీయారెస్ కి గొప్ప చిక్కులే తెచ్చిపెట్టిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: