క‌రోనాను క‌ట్ట‌డి నివార‌ణ‌లో భాగంగా గ‌తంలో నిర్ణ‌యం తీసుకున్న 50 శాతం సిటీ స‌ర్వీసుల ఆప‌రేష‌న్స్‌ను ర‌వాణా శాఖ మంత్రి కోరిక మేర‌కు 75 శాతం బ‌స్సుల‌ను న‌డుపుకోవ‌డానికి ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర రావు అంగీక‌రించారు. పెరిగిన డీజిల్ ధరలు, 50 శాతం మాత్రమే బస్సులు నడపడంతో ఆర్టీసీ నష్టాల్లో కొనసాగుతుంది. ఈ క్రమంలోనే నష్ట నివారణ చర్యలు చేపట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేయనుంది. కరోనా వల్ల లాక్ డౌన్ కారణంగా ఆర్టీసీ వ్యవస్థ ఆర్థికంగా కుదేలైన సంగతి తెలిసింతే. అనంతరం బస్సులు నడుపుతున్నా అవి పాక్షింగానే తిరుగుతున్నాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం, ప్రజల్లో అవగాహన పెరగడం, కరోనాకు టీకా రావడం వంటి సానుకూల కారణాల రిత్యా బస్సుల సంఖ్యను పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
                           క‌రోనా ప‌రిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న టిఎస్‌ఆర్టీసీ స్థితిగ‌తుల‌పై సంస్థ‌ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించిన స‌మ‌యంలో ర‌వాణా శాఖ మంత్రి ajay KUMAR' target='_blank' title='పువ్వాడ అజ‌య్ కుమార్‌-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పువ్వాడ అజ‌య్ కుమార్‌ సిటీ స‌ర్వీసుల ఆప‌రేష‌న్స్‌పై విన్న‌వించిన విన‌తిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. న‌గ‌ర ప్ర‌యాణీకుల కోసం బ‌స్సుల సంఖ్య‌ను పెంచితే సౌల‌భ్యంగా ఉంటుంద‌ని అభిప్రాయపడ్డారు. త‌ద్వారా సంస్థ‌కు కాస్త ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంద‌ని ముఖ్య‌మంత్రికి మంత్రి విన్న‌వించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విన‌తిపై ముఖ్య‌మంత్రి సానుకూలంగా స్పందిస్తూ 75 శాతం బ‌స్సులు న‌డుపుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చారు. కోరిన వెంట‌నే ముఖ్య‌మంత్రి అంగీక‌రించ‌డం ప‌ట్ల మంత్రి హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సిటీ స‌ర్వీసుల రాక‌పోక‌లు పెర‌గ‌డం ద్వారా ప్ర‌యాణీకుల ఇబ్బందులు కొంత తొల‌గిపోనున్నాయని మంత్రి తెలిపారు. త్వరలోనే 75 శాతం బస్సులు నడుపుతామని అజయ్ కుమార్ తెలియజేశారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య నగరవాసులకు మేలైన ప్రయాణ సౌకర్యం అందిస్తామన్నారు. అదేవిధంగా సంస్థను న‌గ‌ర‌వాసులు ఆద‌రించాల‌ని పువ్వాడ అజయ్ కుమార్ ఆకాంక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: