ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మంత్రులు సహకరించలేదు అంటే మాత్రం పరిణామాలు చాలా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. కానీ చాలా మంది మంత్రులు ఇప్పుడు మీడియా ముందుకు రావడానికి కూడా భయపడే పరిస్థితి ఉన్న మాట వాస్తవం. ఎందుకు భయపడుతున్నారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పీడ్ గా ఉంటే ఆయన మీద విమర్శలు చేయడానికి  కూడా చాలా మంది మంత్రులు వెనకడుగు వేస్తున్నారు.  ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు అదే విధంగా ఉండటంతో ముఖ్యమంత్రి జగన్ కూడా సీరియస్ అవుతున్నట్లు తెలుస్తుంది.

ప్రధానంగా సీనియర్ మంత్రులు కొంతమంది అసలు మీడియాతో మాట్లాడక పోవడం గమనార్హం. మీడియాతో మాట్లాడిన సరే పెద్దగా విమర్శలు చేయడం లేదు. దీని వెనుక అసలు కారణం ఏంటనేది ముఖ్యమంత్రి జగన్ కు కూడా అర్థం కావడం లేదు. తన తండ్రి హయాంలో కీలక శాఖలు నిర్వహించిన వారు కూడా ఇప్పుడు సైలెంట్ గా ఉండడం పై జగన్ సీరియస్ గా ఉన్నారు. అంతే కాకుండా ఎమ్మెల్యేలుగా అనుభవం ఉన్నవాళ్లు గతంలో మంత్రిగా పని చేసిన వాళ్ళు కూడా తనకు సలహాలు ఇవ్వకపోవడం సైలెంట్ గా ఉండటంతో ముఖ్యమంత్రి జగన్ లో అసహనం అనేది పెరిగిపోతుంది అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి.

 తన నుంచి అన్ని విధాలుగా సహాయసహకారాలు ఉన్నాసరే కొంతమంది మాత్రం అసలు మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు అనే దానిపై జగన్ ఇప్పుడు ఆరా తీస్తున్నారు. అధికారులతో కూడా పెద్దగా కొంతమంది మంత్రులు మాట్లాడటం లేదు. గత కొంతకాలంగా సచివాలయానికి కూడా కొంతమంది మంత్రులు దూరంగా ఉండటం పై ముఖ్యమంత్రి జగన్ లో ఆగ్రహం అనేది పెరిగిపోతుంది.  మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఈ వ్యవహారం కాస్త అలజడి రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: