గత నెల బంగ్లాదేశ్ కి చెందిన ముగ్గురు ప్రయాణికులు పాస్ పోర్ట్ లు  అనుమానస్పందంగా ఉన్నాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు.  ఇమ్మిగ్రేషన్ అధికారులు సమాచారం ఇచ్చారు  అని ఆయన వెల్లడించారు. వీరిని విచారణ చేస్తే , నకిలీ పత్రాలు ద్వారా పాస్ పోర్టులు పొందినట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు. 72 పాస్ పోర్ట్ లు ఇలా నకిలీ పత్రాలు ద్వారా పాస్ పోర్ట్ లు పొందారు  అని ఆయన వివరించారు. మన రాష్ట్రం లో బోధన్ నుండి దుబాయ్ కి వెళ్లే ప్రయత్నం చేయగా దొరికి పోయారు అని సీపీ పేర్కొన్నారు.

మొత్తం ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశాము, ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు  అని అన్నారు. ప్రధాన నిందితుడు నీతై దాస్ అలియాస్ సంజీబ్ దుట్ట అందరికి పాస్ పోర్టులు ఇప్పించారు  అని వెల్లడించారు. ఈ పాస్ పోర్ట్ స్కామ్ లో ఎస్సై  మల్లేష్ రావు, ఏఎస్సై  అనిల్ కుమార్ ను అరెస్ట్ చేశాము  అని ఆయన అన్నారు. ఈ కేసులో మరో ముగ్గురు పరారీ లో ఉన్నారు.. వారి కోసం గాలిస్తున్నాం  అని ఆయన తెలిపారు. బోధన్ లో 7 అడ్రెస్ పేరుతో మొత్తం 72 పాస్ పోర్ట్ లు పొందారు  అని ఆయన అన్నారు.

బోధన్ ఒకే అడ్రెస్ పై 37 పాస్ పోర్ట్ లు తీసుకున్నారు  అని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో ఇద్దరు పోలీసులు కూడా ఎలాంటి వేరిఫికేషన్ చేయకుండా క్లియరెన్స్ ఇచ్చారు అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాన నిందితుడు 10 నుండి 30 వేల వరకు  ఒక్కో పాస్ పోర్ట్ కోసం డబ్బులు తీసుకున్నారు అని ఆయన అన్నారు. ఇక ఈ పాస్పోర్ట్ వ్యవహారం తెలంగాణా రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనిపై బిజెపి తెరాస మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: