ఆంధ్రప్రదేశ లో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు దగ్గరయ్యే విధంగా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులు అందరూ కూడా ధరల దెబ్బకు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా వరకు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఆయన ముందుకు వెళ్లాలి.

కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి కనపడటం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత మాత్రం బాగా లేకపోవడంతో ప్రజలు మీద ఇంకా ముఖ్యమంత్రి జగన్ భారం వేసే అవకాశాలు కనబడుతున్నాయి. పెట్రోల్ ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదని అర్ధమవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు రోజురోజుకూ పెట్రోల్ ధరలు పెంచుతూ పోతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్ ధరలపై విధించిన అనేక పన్నులను తగ్గించే ఆలోచనలో కూడా లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

దీని కారణంగా సామాన్య ప్రజల్లో ముఖ్యమంత్రి జగన్ పై ఆగ్రహం పెరుగుతుంది. వాహనదారులు అయితే కేంద్ర ప్రభుత్వం తీరుపై చాలా అసహనంగా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ వాళ్ళకు అండగా నిలవాల్సి ఉంటుంది. సంక్షేమం పేరుతో ప్రజలకు భారీగా డబ్బులు ఇచ్చినా సరే ఎలాంటి ఉపయోగం ఉండదు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఎంత వరకు ప్రజలను ఆకట్టుకునే విధంగా ముందుకు వెళ్తారు ఏంటి అనేది చూడాలి. ఆర్థికంగా రాష్ట్రంలో పరిస్థితి చాలావరకు దారుణంగా ఉందని ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ఆదాయ మార్గాల కోసం ప్రజల మీదనే ఆధారపడే పరిస్థితి వచ్చింది అనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. మరి ఏం చేస్తారు ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: