పుండు మీద కారం జల్లినట్టు ఉండటం అంటే ఇదేనేమో..అసలే చంద్రబాబు కాస్త బ్యాడ్ మూడ్‌లో ఉన్నారు. సొంత నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటింది. దీంతో వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి గెలవాలంటే.. అక్కడి వారిని ప్రసన్నం చేసుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. అందుకే చంద్రబాబు ఉన్నపళంగా కుప్పం యాత్రకు బయలు దేరారు. కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు ఇప్పటికే కుప్పం వాసుల ముందు తప్పు ఒప్పుకున్నారు.

అసలే చంద్రబాబు బ్యాడ్ మూడ్‌లో ఉంటే.. చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరింత చిరాకు తెప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ పర్యటనలో టీడీపీ తరపున నటుడు ఎన్టీఆర్ ప్రచారం చేయాలని కార్యకర్తలు చంద్రబాబును కోరారు. జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకురావాల్సిందే అంటూ నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబుకు చిరాకొచ్చింది. కానీ.. అసలే కప్పుంలో పరిస్థితి బాగాలేదు కదా అంటూ మౌనంగా భరించారు.

కార్యకర్తలు జై జూనియర్ ఎన్టీఆర్ అని నినాదాలు చేస్తుంటే.. ఏమీ చేయలేక అలాగే అలాగే అన్నట్టు చంద్రబాబు మౌనంగా తలూపారు.  2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ప్రచారం చేసి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా నల్గొండ జిల్లాలో ఎన్టీఆర్ వాహనానికి ప్రమాదం జరిగింది. అటు తర్వాత ఆయన ప్రచారం చేయలేదు. ఆ తర్వాత 2014లో ఉమ్మడి ఏపీని విభజించారు. ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రచారానికి దూరంగా ఉన్నారు.

ఇక కొన్నాళ్ల క్రితం తెలంగాణకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా కూకట్‌పల్లి నుంచి హరికృష్ణ కుమారై సుహాసినిని నిలబెట్టారు. అప్పుడు అక్క సుహాసినికి మద్దతుగా ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని అందరూ అనుకున్నా.. జూనియర్ మాత్రం ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉండిపోయారు. ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్‌తో ప్రచారం చేయించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. అసలు ప్రచారం సంగతే కాదు.. లోకేశ్ ను పక్కకు పెట్టి ఎన్టీఆర్‌కు పార్టీ అప్పగించాలన్న డిమాండ్ కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: