ఎమ్మెల్సీ ఎన్నిక‌లు హోరాహోరీగా జ‌రుగుతాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు, సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు పేర్కొంటుండ‌గా ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం టీఆర్ ఎస్ జెండా ఎగ‌ర‌బోతోంద‌ని తేల్చేశారు. సీఎంకు ఇంట‌లిజెన్స్ రిపోర్టు అంది ఉంటుంద‌నే అభిప్రాయం పార్టీ శ్రేణుల మ‌ధ్య జ‌రుగుతోంది. అయితే అదంతా ఉత్తిదే... గ్రేట‌ర్, దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లోనూ కేసీఆర్ చెప్పిన విష‌యాలు నిజం కాలేద‌ని చెబుతున్నారు. అయితే స‌హ‌జంగానే ఏ రాజ‌కీయ పార్టీ అధ్య‌క్షుడైనా ఇలానే చెబుతుంటారు. దాంట్లో పెద్ద‌గా శోధించాల్సిందేమీ లేదు. అయితే అభ్య‌ర్థులు ఎక్కువ‌గా ఉండ‌టంతో ఓట్లు భారీ చీలే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం మొద‌ట్నుంచి విన‌బ‌డుతోంది.


న‌ల్గొండ స్థానంలో అయితే ఏకంగా 70మంది నిల‌బ‌డ్డారు. వీరంతా కూడా వివిధ ప్రాంతాల‌కు చెందిన వారు కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఓట్లు తలా కొన్ని పంచుకున్నా...టీఆర్ ఎస్ పార్టీకి చెందిన అభిమానులు, ప‌ట్ట‌భ‌ద్రులైన టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు ఓటు వేసినా మిగ‌తా వారికంటే ప్ల‌స్‌లోకి వ‌స్తామ‌నే ధీమాతోనే కేసీఆర్ వ్యాఖ్య‌నించి ఉంటార‌న్న విశ్లేష‌ణ జ‌రుగుతోంది. హైద‌రాబాద్ స్థానం విష‌యంలో కేసీఆర్ చెప్పిన‌ట్లు జ‌ర‌గ‌కున్నా... న‌ల్గొండ స్థానంలో జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని గుర్తు చేస్తున్నారు.


ఇదిలా ఉండ‌గారంగారెడ్డి-హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్ధి సురభి వాణీదేవి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్క ఒటరును కలుసుకునేలా కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్టీ సభల్లో పాల్గొంటూనే, వ్యక్తిగతంగా ఓటర్లను కలుస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి కూడా ప్రచారంలో వేగం పెంచారు. రోజూ మూడు జిల్లాల్లో క‌నీసం 20 కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటుండ‌టం విశేషం. స‌గ‌టున 3000మందితో ఇంటారాక్ట్ అవుతుండ‌టం విశేషం. సాధ్య‌మైనంత ఎక్కువ‌మందిని పార్టీవైపు చూసేలా చేయ‌డ‌మే ల‌క్ష్యంగా టీఆర్ ఎస్ శ్రేణులు ముందుకు క‌దులుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో స‌త్తాచాటితే బీజేపీకి, కాంగ్రెస్‌కు ఆటోమేటిక్‌గా చెక్ ప‌డుతుంద‌ని గులాబీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: