సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా వరకు దూకుడుగా వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కొన్ని విషయాల్లో ముఖ్యమంత్రి జగన్ కు ఇప్పుడు ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయి. ప్రధానంగా పార్టీలో ఉన్న అగ్రనేతలు సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రచారం చేయలేకపోతున్నారు. కార్యకర్తలు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లే విధంగా ప్రయత్నాలు చేయకపోవడంతో పార్టీ ఎక్కువ ఇబ్బందులు పడుతున్నది అనే ఆవేదన కొంతమందిలో వ్యక్తమవుతున్నది.

రాజకీయంగా క్షేత్రస్థాయి పరిస్థితులను కూడా మంత్రులు అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల విషయంలో ముఖ్యమంత్రి జగన్ సినీ నటుల మీద ఆధార పడే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి సంబంధించి కొంత మంది తమిళనాడు నటులతో ప్రచారం చేయించే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇద్దరు హీరోయిన్లతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సంక్షేమ కార్యక్రమాలు పేదలకు మాత్రమే అనే విషయాన్ని బలంగా తీసుకుని వెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.

అలాగే టాలీవుడ్ హీరోలతో కూడా ఇప్పుడు ప్రచారం చేయించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. యువ హీరోలు ఇద్దరు ప్రభుత్వానికి ప్రచారం చేయడానికి ముందుకు వస్తున్నారని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా స్పష్టత లేకపోయినా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశాలు ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. అయితే తమిళనాడుకు చెందిన మాజీ హీరోయిన్లు ఎవరు అనేది తెలియకపోయినా... రమ్యకృష్ణ పేరు మాత్రం వినపడుతుంది. అలాగే మరో హీరోయిన్ స్నేహ పేరు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో వినపడుతుంది. మధ్యతరగతి మహిళలుగా వీళ్లిద్దరు ఒక వీడియో లో నటించే అవకాశం ఉందని అయితే వీళ్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయానికి రాలేదు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: